స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ.

0
120

 

 

స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి జగన్ లేఖలు: పట్టాభిరామ్ ఆరోపణ

12-06-2026 Friday

Andhra

YS Jagan Mohan Reddy letters for sale of Steel Plant lands Pattabhiram allegation

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయడంలో జగన్ పాత్రపై టీడీపీ ఆరోపణ

ప్లాంట్ భూములు అమ్మి నిధులు సమీకరించాలని కేంద్రానికి జగన్ లేఖలు రాశారన్న పట్టాభి

ఉక్కు గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకున్నారని విమర్శ

జగన్ హయాంలో ఉత్పత్తి తగ్గి, ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని, కీలకమైన గనుల లీజులను పునరుద్ధరించకుండా అడ్డుకోవాలని జగన్ కేంద్రానికి లేఖలు రాశారని, ఇటువంటి చర్యల వల్లే ప్లాంట్ ఆర్థికంగా కుదేలైందని ఆయన విమర్శించారు.

 

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన వేలాది ఎకరాల భూములను విక్రయించి, ఆ నిధులతో ప్లాంట్‌ను బలోపేతం చేయాలని జగన్ కేంద్రానికి ప్రతిపాదించారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన పత్రాలను ఆయన మీడియాకు ప్రదర్శించారు.

 

జగన్ ప్రభుత్వ హయాంలో (2019-2024) ప్లాంట్‌కు అనుబంధంగా ఉన్న విజయనగరం జిల్లాలోని మాంగనీస్, సిలికా గనుల లీజులను ఉద్దేశపూర్వకంగానే పునరుద్ధరించలేదని పట్టాభి ధ్వజమెత్తారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం 25 శాతం పడిపోయిందని, ఉద్యోగుల సంఖ్య కూడా 2020లో 17,000 ఉండగా, 2023 నాటికి 14,800కి తగ్గిపోయిందని వివరించారు.

 

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గనుల లీజులను పొడిగించిందని, తద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని 90 శాతానికి పైగా పునరుద్ధరించిందని పట్టాభి తెలిపారు. ప్రభుత్వ చొరవ ఫలితంగా ప్లాంట్ సుమారు రూ. 54 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటానని జగన్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, ఆయన గతంలో కేంద్రానికి రాసిన లేఖలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.                                

Search
Categories
Read More
Andhra Pradesh
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి శ్రేణులకు ముఖ్య గమనిక
    *రేపు 11-07-2026 (శనివారం) ఉదయం 10:00 గంటల నుండి మదనపల్లి పట్టణంలోని రాజంపేట...
By Benguluri Madhubabu 2026-07-10 13:59:23 0 192
BMA
Human Reporting: The Press Fights AI News Automation
As AI-generated content and automated narratives rapidly flood digital platforms, the public is...
By JoinBMA 2026-08-20 06:09:47 0 191
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్లో ఈ నెల22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 1౦గంటల...
By Chennaiah Kati 2026-06-21 13:49:48 0 111
Telangana
ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం...
By Prashanth Goindla 2026-02-09 07:19:41 0 527
SURAKSHA
Shri P.S. Reddy, IAS - Finance Secretary, DNH&DD
Fiscal Discipline, Transparent Governance, and Public Trust "True public service is measured not...
By Kalaga Sailaja 2026-07-29 08:37:04 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com