శాయంపేట మక్కల కొనుగోలు కేంద్రంలో భారీ మోసం -బస్తాకు 30 నుండి 40 రూపాయలు అదనపు వసూలు -60 లక్షల వరకు రైతుల నుండి వసూలు -ప్రభుత్వ నిబంధనలు పాటించని PACS నిర్వాహకులు

7
1K

హన్మకొండ జిల్లా లోని శాయంపేట మండలంలో గత రబీ సీజన్లో రైతులు అధికంగా మక్కలు పండించారు. ఖరీఫ్ సీజన్ మొదటి దశలో వేసిన పత్తి పంటపై వర్షాల ప్రభావం అధికంగా ఉండటం వలన రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూసారు. ముఖ్యంగా కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బపడి తీవ్రంగా నష్టపోయారు. తద్వారా రెండవ పంట వేసే క్రమంలో రైతులు మండల వ్యాప్తంగా చాలా ఎకరాలలో మొక్క జొన్న సాగుకు మొగ్గుచూపారు. రేయి పగలు కష్టపడి పండించిన పంట పై అధిక దిగుబడులు సాధించారు. అనుకున్నదే తడువుగా ప్రభుత్వం కూడా రైతన్నలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్ ఫెడ్ మద్దతు ధర 2400 చొప్పున క్వింటాలుకు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుని శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రాథమిక సహకార సంఘ ప్రతినిధులు వ్యవహరించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి సరైన సంఖ్యలో గన్ని బ్యాగులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాభావ పరిస్థితుల్లో భయపడిన రైతన్న అధిక డబ్బులు వెచ్చించి ప్రైవేటుగా గన్ని బ్యాగులు కొనుగోలు చేసి మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాల నుంచి కేంద్రానికి ట్రాక్టర్ లలో కిరాయి పెట్టుకుని వచ్చిన రైతన్నకు అడుగడుగున నిరాశే ఎదురైంది.

దాదాపు 60 లక్షల నుండి 70 లక్షల వరకు దండుకున్నారు

కొనుగోలు కేంద్రంలో ఎప్పటికపుడు సత్వరమే కాంటాలు నిర్వహించాలి , కాంటా అయిన తర్వాత బస్తాల పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రాలదే అన్న ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తూ రైతుల ధాన్యాన్ని తూకం వేయడానికి వారం రోజులు ఆలస్యం చేసిన తర్వాత బస్తాలు లారీలో ఎగుమతి కావాలంటే హమాలీ ఛార్జీలు 60 నుండి 65 రూపాయలే కాకుండా ఒక్కో 51 కేజీ బస్తాకు 30 రూపాయలు అదనంగా డబ్బులు చెల్లించిన రైతు ధాన్యం మాత్రమే ఎగుమతి చేయాలని,లేనిచో కాంటా అయిన కూడా ఆ బస్తాలకు కొనుగోలు కేంద్రానికి సంబంధం లేదని పూర్తి బాధ్యత రైతే తీసుకోవాలని దురుసుగా ప్రవర్తించారు. హన్మకొండ జిల్లాలో అత్యధికంగా 2 లక్షలకు పైగా బస్తాలు రైతుల నుండి కొనుగోలు చేసి ఒక్కో బస్తాకు 30 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే మద్దతు ధర లభిస్తుందని ఆశపడ్డ రైతన్న ను మోసం చేశారు కేంద్ర నిర్వాహకులు,కావున ప్రభుత్వం మరియు జిల్లా , రాష్ట్ర మార్క్ ఫెడ్ అధికారులు స్పందించి శాయంపేట ప్రాథమిక సహకార సంఘం పర్యవేక్షణలో నిర్వహించిన కొనుగోలు కేంద్రం పై విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పార్వతీపురం జిల్లాలో గజరాజుల సంచారం
పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గజరాజులు...
By Boiena Rajesh 2026-03-23 05:03:05 0 262
Assam
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
By BMA ADMIN 2025-08-11 10:23:00 0 2K
Andhra Pradesh
*దూళ్ళ వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్...
By Vadlamudi NagaVenkat 2026-03-05 08:55:51 0 396
Andhra Pradesh
St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం
చీరాల: St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్...
By Gadiyapudi Narendra 2026-01-19 14:35:50 0 501
SURAKSHA
Shri Amit Sharma, IPS: Courage, Commitment and Modern Policing
A distinguished 2010-batch IPS officer of the AGMUT Cadre, Shri Amit Sharma has built a...
By Kalaga Sailaja 2026-07-29 06:54:10 0 289
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com