క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు

0
182

*క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు*

 

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలోని బోటు గూడెం లో కోడి దానం వయస్సు 65 సంవత్సరములు అనే పాస్టర్ గారు గత 10 సంవత్సరముల క్రితం తన కష్టార్జితముతో స్వతహాగ మందిరమును నిర్మించుకొని సేవ పరిచర్య మరియు సోషల్ సర్వీస్ చేయుచున్నారు. మార్చి నెల 31వ తేదీన కొంతమంది దుండగులు పాస్టర్ కోడి దానం గారు నిర్మించుకొనిన మందిరమును ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయం గురించి దోర్నాల మండల పోలీస్ స్టేషన్ కి 100 కి డయల్ చేయడం జరిగింది . తరువాత కానిస్టేబుల్ , ఏఎస్ఐ వచ్చి కూల గోట్టడం చూసి ఇది హిందువులే కట్టుకున్నారు అంటూ వాళ్లే కూల్చుకున్నారని ఎందుకు కంప్లైంట్ చేశారు అని పాస్టర్ గారిని బెదిరించి వెళ్లారు. పోలీసు వారు ఏమైనా చేస్తారేమో అని పాస్టర్ గారు ఎదురు చూశారు. కానీ పోలీసు వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. అటు తర్వాత ఏప్రిల్ 8వ తేదీన పోలీస్ స్టేషన్కు వచ్చి కోడి దానం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసు వారు నుంచి ఎటువంటి స్పందన లేదు. పది పది దినముల వరకు కోడి దానం గారు ఎదురు చూడడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. మరల ఏప్రిల్ 18 తేదీన పాస్టర్ గారు మరల అనుమానితుల పేర్లను రాసి దోర్నాల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట రమణయ్య గారికి ఇవ్వడం జరిగింది. ఎస్సై గారు అనుమానితుల పేర్లు రాసినటువంటి కంప్లైంట్ తీసుకొనకుండా అనుమానితుల పేర్లు లేని పేపర్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 36/26 కానీ పోలీసు వారు ముద్దాయిలను పిలిపించి ఎటువంటి విచారణ జరుపకపోవడం దురదృష్టకరం.మరల మే 19వ తేదీన పాస్టర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు చర్చి దగ్గరికి వెళ్లి చూడగా మందిర సామాగ్రి రేకులు, పైపులు, తలుపులు , ఫ్యాన్లు, టేబుల్, కుర్చీలు వాటితో పాటు పాస్టర్ గారికి సంబంధించిన ఒక పెట్టే , ఇతర సామాగ్రి ఏమి లేకపోవడం ఆశ్చర్యకరం మరియు చాలా బాధాకరం.చర్చి సామాగ్రి దొంగిలించారని పాస్టర్ గారు మరలా వచ్చి పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చారు.అయినా పోలీస్ వారు పట్టించుకోలేదు . మరల మే 31వ తేదీన ఆదివారం కోడి దానం పాస్టర్ గారు మార్కాపురం లో ఉన్న కుమార్తెల దగ్గరకు వెళ్ళి మార్కాపురం నుండి దోర్నాలకి వచ్చి నల్లగుంట్ల బస్సు కోసం ఎదురుచూస్తుండగా దోర్నాల బస్ స్టాండ్ లో సాయంత్రం 4 గంటల 30 నిమిషములకు గుర్తుతెలియని దుండగులు పాస్టర్ గారిని గొంతు పట్టుకొని పైకి లేపి, కింద పడ వేయడం జరిగింది.పాస్టర్ గారి భార్యను కూడా నెట్టివేసి చెప్పలేని బూతులతో తిట్టారు.పాస్టర్ గారు పోలీస్ వారికి కంప్లైంట్ చేశారు. దోర్నాల బస్టాండ్ లో సీసీ కెమెరాలు ఉన్నవి ఎస్సై గారు సిసి టీవీ బస్టాండ్ మొత్తం కవర్ కాలేదని కేసు కట్టలేదు.మరుసటి రోజు పాస్టర్ గారు పోలీస్ స్టేషన్ కి రాగా బోటుగూడెం లోని మందిరం ప్రక్కన ఉన్న చిన్న బయన్న తన కుమారుడిని పోలీసులు పిలిపించారు.చిన్న బయన్న అనే అతను నేనే చర్చిని కూల్చి వేశాను నేనే మందిర రేకులను ఇతర సామాగ్రిని తీసుకెళ్ళాను అని చెప్పగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం హాస్యాస్పదం మరియు బాధాకరం. అందుకుగాను సెక్షన్ బిఎన్ఎస్ 94 క్రింద మీకంటూ చర్చికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే తీసుకుని రమ్మని నోటీసులు పాస్టర్ గారికి ఇచ్చారు. అందుకుగాను పాస్టర్ కోడి దానం గారు డాక్యుమెంట్స్ పెట్టే కూల్స్ వేసిన మందిరంలో ఉందేమోనని బోటు గూడెంకు వెళ్లి వెతుకుతుండగా ఆలోపు అక్కడ ఉన్న చిన్న బయన్న, అతని భార్య, కుమారులు, కోడళ్ళు పెద్ద పెద్ద రాళ్లు తీసుకొని పాస్టర్ కోడి దానం గారిని చంపబోయారు.వారు రాళ్ళు రువ్వినప్పుడు పాస్టర్ గారు కుటుంబ సభ్యులు కోడి దానం పాస్టర్ గారిని పక్కకి లాగగా తృటిలో ప్రాణాపాయం తప్పింది. అందు నిమిత్తము పాస్టర్ గారు వీడియో ఎవిడెన్స్ కంప్లైంట్ చేశారు. అయిన పట్టించుకొని పోలీసులు. పోలీసు వారు వీడియో ఎవిడెన్స్ ఉన్నాగాని దుండగులపై చర్యలు తీసుకొనకుండా పాస్టర్ గారిని మరియు వారి కుటుంబ సభ్యుల మీద మీరే వారిని కులం పేరుతో దూషించారని మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కడతానని పాస్టర్ గారిని వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. దోర్నాల పోలీసులు ఆ తరువాత పోలీస్ స్టేషన్ కి వచ్చి మీరే దుర్భాషలాడా రు నా విధులకు ఆటంకం కలిగించారు అని ఎస్ఐ గారు కేసు కడతానని బెదిరిస్తున్నారని ఇంత జరుగుతున్న దోర్నాల ఎస్సై గారు వెంకటరమణయ్య మరియు ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ గారు మీరు క్రైస్తవులని చులకన భావంతో చూస్తూ దుండగులను విచారించడం గాని దుండగులపై చర్యలు తీసుకోకపోవడం గాని చేయడం లేదు.దయచేసి పై అధికారులు స్పందించి పాస్టర్ కోడి దానం గారికి తగిన న్యాయం చేయవలసినదిగా పాస్టర్ గారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇలా వదిలేసి దుండగులపై చర్య తీసుకోకపోవడం పోలీసులే మత కలహాలు సృష్టించిన వారు అవుతారు. దీని విషయమై పై అధికారులంతా వెను వెంటనే స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని మనవి. ఈ కార్యక్రమంలో గాడ్స్ వే మిషన్ సువార్తికులు మల్లికార్జున రావు, దోర్నాల మండల పాస్టర్స్ మరియు సువార్తికుల అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ బుట్టి పాల్ స్పర్జన్, సెక్రటరీ పాస్టర్ మేడిపల్లి అశోక్ కుమార్, మార్కాపురం జిల్లా ఏఐసిసిసి అధ్యక్షుడు రెవరెండ్ సన్నెపోగు సుందర్రాజు, జిల్లా ఏఐసిసిసి సెక్రటరీ రెవరెండ్ యలకపాటి ఇశ్రాయేలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ చేదూరి కన్నా,ఎర్రగొండపాలెం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ చాట్ల గంగయ్య,ఎర్రగొండపాలెం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ వెంకటయ్య, దోర్నాల మండల ఏఐసిసిసి అధ్యక్షుడు రెవరెండ్ ప్రభుదాస్, దోర్నాల మండల క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు రెవరెండ్ సింగా యేసుదానం , దోర్నాల మండల పాస్టర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు కాసిమల్ల రూబెన్ మరియు తదితర పాస్టర్స్ పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆపదలో ఉన్నవారికి చేయూతగా కిద్మత్ టీం లీడర్ షేక్ షఫీ
*ఆపదలో ఉన్నవారికి చేయూతగా నిలవడం మానవ ధర్మం*    *-ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ* ...
By Rajini Kumari 2026-01-01 10:30:18 0 258
Telangana
కవిత ప్రాoచజన్యం పేరుతో 5హామీలను ప్రకటించారు
కవిత "ప్రాంచజన్యం"..,పేరుతో ఐదు హామీలను ప్రకటించారు  1: విద్య ప్రైవేటు స్కూళ్లలో కూడా...
By MERIGE MALLESH 2026-04-25 07:45:04 0 697
Andhra Pradesh
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్...
By Gadiyapudi Narendra 2026-01-04 16:19:40 0 580
Andhra Pradesh
చింతూరులో తృటిలో తప్పిన పెను ప్రమాదం: మంటల్లో దగ్ధమైన గూడ్స్ లారీ!
చింతూరు మార్గంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుండి చింతూరు వైపు వెళ్తున్న...
By Shyamala Yadagiri 2026-06-03 15:45:18 0 245
West Bengal
Free Bus Travel For Women & Annapurna Yojana Launched
The West Bengal government announced a massive welfare push today by approving free bus travel...
By Dunna Jessicaruth 2026-05-18 10:52:19 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com