యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా.. హైడ్రాతో ప్రజల్ని వణికించిన.. సీఎం రేవంత్‌రెడ్డి

0
162

అది బెంగళూరు వేదిక.. అక్కడ జరుగుతున్నది జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ నిర్వహించిన ‘బెంగళూరు ది హిందూ’ హడిల్‌ కార్యక్రమం.. అక్కడ ప్రశ్నలు అడుగుతున్నది పాత్రికేయ దిగ్గజం, సీనియర్‌ సంపాదకుడు, ‘ది హిందూ’ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎన్‌ రామ్‌..! జవాబులు చెప్తున్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆయన చెప్తున్న మాటలకు అంతటి పాత్రికేయుడే విస్తుపోయాడు..

‎యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించిన.. హైడ్రాతో ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చినం.. నగరంలో భయాన్ని పుట్టించినం’ అని బెంగళూరులో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘హిట్లర్‌ నాకు స్ఫూర్తి.. హిట్లర్‌ కోర్‌ టీమ్‌ పేరైన హైడ్రాను ఆయన స్ఫూర్తితోనే తీసుకొచ్చాను’ అని చెప్పుకోవడంపై రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘రేవంత్‌రెడ్డి తెలంగాణ హిట్లర్‌’ అని పేర్కొంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఆయనపై దండయాత్ర చేస్తున్నారు. ‘ది హిందూ’ దినపత్రిక నిర్వహించిన ఆ కాంక్లేవ్‌ వేదికగా కోట్లాది మంది వీక్షించే ఆ కార్యక్రమంలో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొన్నారని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్రస్థాయిలో మండిపడుతున్నది. ఆ కాంక్లేవ్‌ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో తాము కూల్చిన ఇండ్లు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధాల్లో కూలిన ఇండ్లతో పోల్చారు..

‎‘ఐ డిమాలిష్డ్‌ లైక్‌ ఎనీథింగ్‌. గో అండ్‌ గూగుల్‌. యూకెన్‌ సీ.. ఇరాన్‌ యూకెన్‌ సే ఇజ్రాయెల్‌ ఆర్‌ ఎనీథింగ్‌. యూకెన్‌ కంపేర్‌ విత్‌ దోజ్‌ డిమాలిషన్స్‌ దీస్‌ డిమాలిషన్స్‌..’ అంటూ వచ్చీరాని ఇంగ్లిష్‌లో హైదరాబాద్‌ హైడ్రా కూల్చివేతలను, ఆ తాలూకు వెతలను, పశ్చిమాసియా యుద్ధం తాలూకు విధ్వంసాన్ని, అక్కడి బాధలను పోల్చుతూ సీఎం రేవంత్‌రెడ్డి సగర్వంగా చెప్పుకొన్నారు. కావాలంటే గూగుల్‌లో చెక్‌ చేసుకోండి.. అంటూ ధీమాగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

‎తెలంగాణ హిట్లర్‌’ అంటూ నెటిజన్ల దండయాత్ర

‎ప్రపంచ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ ఆదర్శం అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లతో దండయాత్ర చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ హిట్లర్‌ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వంటి వేదికలపై నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా.. లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘ది హిందూ’ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలలతో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

‎పోరాడి సాధించుకున్న తెలంగాణకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో? తెలియడం లేదంటూ తెలంగాణ ప్రజలు మధనపడుతుంటే.. ప్రపంచమంతా భయపడే ఓ క్రూర నియంతను ఆదర్శంగా తీసుకొని తాను మాత్రం నవ్వుతున్నాడని కామెంట్ల రూపంలో మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రపంచం మొత్తం తిరస్కరించిన క్రూర నియంత.. ఎలా ఆదర్శమవుతాడు? అంటూ నిలదీస్తున్నారు. హిట్లర్‌ చనిపోయినా కూడా ఆయన ఐడియాలజీ హైడ్రా రూపంలో బతికే ఉన్నదని.. దానిని రేవంత్‌రెడ్డే పెంచి పోషిస్తున్నారని కామెంట్లతో ఉవ్వెత్తున విరుచుకుపడుతున్నారు. అంతేకాదు.. హైడ్రా చేసే చర్యలన్నీ నాజీలు చేపట్టే చర్యలేనా? దానిని రేవంత్‌రెడ్డి కచ్చితంగా సమాధానం చెప్పాలి.. అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇమేజ్‌ డిమాలిష్‌..

‎డిమాలిష్‌తెలంగాణ ప్రభుత్వ అప్పులు

‎చాలా విషయాలు మాట్లాడారు రేవంత్‌ అకడ. ఢిల్లీ ముందు రెండో తరగతి పౌరులుగా ఉండాలా? అని అడిగారు. ఆడవాళ్ల పేరుతో డీలిమిటేషన్‌ రాజకీయాలు చేయొద్దని, ఇంటి దగ్గర నుంచి పికప్‌ చేసుకోవడమే ప్రైవేట్‌ సూళ్ల విజయరహస్యం అని, సూళ్ల సంఖ్య 75 శాతం తగ్గిస్తా.. అని చెప్పారు. వీటిలో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసేవి చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి చర్చ జరగాలి. కానీ హిట్లర్‌, హైడ్రా గురించి ఆయన అన్న మాటలు అందరినీ హుక్‌ చేశాయి! సహజమే. అన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు. కానీ, ఏదో తెలిసినట్టుగా మాట్లాడే కృత్రిమ ప్రయత్నంలో భంగపాటు కలుగుతుంది. ఎంతోకొంత ప్రపంచ జ్ఞానం, ప్రజాజీవితానికి సంబంధించిన ఇంగితం, డిసెన్సీతో వ్యవహరించాలన్న పట్టింపు లేకపోతే, నోటికి వచ్చింది మాట్లాడుతారు, పరువు తీసుకుంటారు.

‎వాళ్ల పరువే కాదు, వాళ్లు ప్రాతినిధ్యం వహించే జనాల పరువు కూడా తీస్తారు. అంత హీనపు మాటలు మాట్లాడినప్పుడు, పకనే ఉన్న సుప్రసిద్ధ పాత్రికేయుడు ఏమనుకున్నాడో? అకడున్న విశిష్ట ప్రేక్షకులు ఎట్లా నవ్వుకున్నారో? ఈయనను ఎన్నుకున్న ప్రజల విచక్షణ గురించి ఎంత తకువగా లెకవేశారో? అని సిగ్గుగా అనిపించింది. మొన్ననే కదా ఒకరు తెలంగాణను పాకిస్థాన్‌తో, పాలస్తీనాతో పోల్చినందుకు బాధపడుతూ నవ్వుకున్నాం. తెలంగాణాతో పోలిక సంగతి పకనపెడితే ఆయనకు పాకిస్థాన్‌ను, పాలస్తీనాను ఒకే గాట కట్టకూడదని తెలియదు. ఇప్పుడు అతనిని మించిన ఆచంట మల్లన్న. ఈ ముఖ్యమంత్రికి ఇరాన్‌లోను, ఇజ్రాయెల్‌లోనూ జరిగిన యుద్ధ విధ్వంసాన్ని డిమాలిషన్స్‌ అనకూడదు అని తెలియదు. ఆయన మనసులో తనను తాను హిట్లర్‌ అని, లేదా జనం మీద యుద్ధం చేయగల ట్రంప్‌నని అనుకుంటున్నారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ను ఒక వరుసలో పెట్టకూడదని తెలిసేంతగా కాంగ్రెస్‌ విధానజ్ఞానం కూడా ఉండే అవకాశం లేదు..

‎రామ్‌తో ‘హడల్‌’ అయిపోయాక, బయట హిందూ రిపోర్టర్‌ ఒకరితో రేవంత్‌ మాట్లాడారు. ఆశ్చర్యకరమైన మాటలున్నాయి ఆ సంభాషణలో.. తెలంగాణ ఏర్పడడం ఎంతో గొప్ప విజయమని, ఐడెంటిటీ ఏర్పడటమే ఆ గెలుపు అని, వ్యక్తిగత సెంటిమెంట్‌ అందులో ముడిపడి ఉన్నదని, పన్నెండేండ్లుగా అభివృద్ధి కూడా జరుగుతున్నదని, కొనసాగుతున్నదని.. రేవంత్‌ ఆ రిపోర్టర్‌కు వివరించారు. ఇటువంటి పాజిటివ్‌ మాటలు ఆయన నుంచి ఎప్పడూ విన్న గుర్తులేదు! కానీ ఆయనే అవి వినిపించకుండా జనాలను హడలగొట్టారు.

Search
Categories
Read More
SURAKSHA
Pranami Program by WB Police Protects Elderly Living Alone Daily
West Bengal Police runs ‘Pranami’ program for senior citizens living alone. Beat...
By Kalaga Sailaja 2026-07-01 12:35:53 0 92
Telangana
కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్...
By Avunoori Mahesh 2026-09-03 10:56:44 0 154
Puducherry
Puducherry Strengthens Biodiversity Conservation Efforts
Puducherry continues to advance environmental conservation and biodiversity protection in 2026...
By Fathima Safa 2026-07-04 13:25:47 0 112
SURAKSHA
Pankaj Lamba IPS: Inspiring Smart Policing in East Siang
A dynamic 2019-batch IPS officer of the AGMUT Cadre, Pankaj Lamba is serving as Superintendent of...
By Lokeshwari Panthadi 2026-08-03 08:12:09 0 263
SURAKSHA
Radha S. Raturi, IAS: Leading Uttarakhand with Vision
A distinguished 1988-batch IAS officer of the Uttarakhand Cadre, Smt. Radha S. Raturi has earned...
By Lokeshwari Panthadi 2026-07-18 05:06:05 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com