"2BHK ఇళ్లు, తాగునీరు, ఆరోగ్య కేంద్రాల కోసం హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి.|

0
263

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. 

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల అవసరాలు, గృహ వసతి మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు అంశాలను ఆయన ఎండీ దృష్టికి తీసుకెళ్లారు.

కౌకూర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న ప్రజలకు తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.

అలాగే మౌలాలి ఆయుష్ వెల్నెస్ సెంటర్, యునాని హాస్పిటల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో మౌలాలి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ) నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అల్వాల్ ప్రాంతంలోని భూధాన్ ల్యాండ్స్ సర్వే నంబర్లు 537, 538, 539, 540లలో పేద ప్రజల గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. 

అలాగే నేరేడ్మెట్ డివిజన్ రామకృష్ణాపురంలోని సర్వే నంబర్ 246లో ఉన్న ప్రభుత్వ భూమిలో కూడా 2బీహెచ్‌కే గృహాలను నిర్మించాలని ప్రతిపాదించారు.

సీబీఎన్ కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న వాంబే గృహ సముదాయాన్ని కూల్చివేసి ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటిపై హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఎన్. జగదీష్ గౌడ్, మేకల రాము యాదవ్, జేఏసీ వెంకన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
​కూటమి పాలనలో గ్రంథాలయాలకు పూర్వవైభవం: వి. ఆర్ రాసాని.
ఆదివారం మదనపల్లి ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ వి. ఆర్...
By Pagadala Venkateswar 2026-06-08 09:23:30 0 112
Andhra Pradesh
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం...
By Pagadala Venkateswar 2026-08-12 05:34:42 0 94
Telangana
ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడి
కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు...
By Bouth Arun 2026-02-11 06:25:54 0 527
Andhra Pradesh
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-07-10 16:35:20 0 128
Telangana
అకాల వర్షానికి నేలమట్టమైన వరి పంట
రామయంపేట మండలం వెంకటాపూర్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి పంట...
By Katiyala JeevanRaj 2026-05-06 10:03:31 0 377
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com