ఆసిఫాబాద్‌ పట్టణం దశ్నపూర్ లో అగ్నిప్రమాదం బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

0
426

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

జూన్ 04: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ కాలనీలో బుధవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, రెండు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు తక్షణ సహాయం కింద అత్యవసర నిత్యావసర సరుకులు, దుస్తులు మరియు రూ. 20,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం తరపున కూడా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్, మున్సిపల్ కౌన్సిలర్లు సలాం, బాలకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ  నాయకురాలు మారుస్కోల సరస్వతి, మండల అధ్యక్షుడు జబోరే రవీందర్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా, దూడల అశోక్, సాయి, శ్రవణ్ తదితర స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Annamayya: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా చిన్నమండెం:   ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... మంత్రి మండిపల్లి...
By Pagadala Venkateswar 2026-07-21 09:56:50 0 119
Bihar
Prashant Kishor stopped from entering Nitish Kumar's home village, claims 'top-down orders'
Jan Suraaj Party founder Prashant Kishor was stopped by district officials from entering Kalyan...
By BMA ADMIN 2025-05-19 18:50:15 0 2K
Andhra Pradesh
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...
By Pagadala Venkateswar 2026-02-22 10:58:17 0 171
Telangana
తెలంగాణ పేరు లేకుండా బతకలేరు.‎కేసీఆర్ పేరెత్తకుండా ఉండలేరు.
అందరి టార్గెట్ కెసిఆర్.. ఆ టార్గెటే ఆయన బలాన్ని సూచిస్తుంది ✊ ‎ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో...
By Ponnala Srinivasrao 2026-04-25 08:59:22 0 156
Rajasthan
Pharma License Revoked After Tragic Deaths in Kota
The Rajasthan government has officially revoked the license of a pharmaceutical firm in Kota...
By Lokeshwari Panthadi 2026-07-01 08:43:34 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com