ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం దారుణం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి

0
337

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్)

ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. సభలో జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్దామని ప్రయత్నిస్తే, తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. సభకు అధ్యక్షత వహించాల్సిన స్థానిక ఎమ్మెల్యే అయిన తనను మాట్లాడనివ్వకుండా, అధికారిక ప్రోటోకాల్‌ను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ఆదివాసి మహిళా ఎమ్మెల్యే అయిన తనపై ముఖ్యమంత్రి చూపిన ఈ వైఖరి బాధాకరమని, ఇది తనకు మాత్రమే కాకుండా మొత్తం ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. సభ సాక్షిగా సమస్యలను లేవనెత్తితే ఏం జవాబు చెప్పాలో తెలియకనే, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.ఈ సమావేశంలో మున్సిపాలిటీ చైర్మన్ యం ఆకాష్ , వైస్ చైర్మన్ యం డి హైమద్, PACS చైర్మన్ అలీ గారు మరియు సర్పంచ్ బుర్స పోచయ్య,మాజీ సర్పంచ్ బలరాం,నాయకులు నిసార్,సైదాం సురేష్, అబ్దుల్లా,సాయి,ఆన్సర్, జావీద్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ సమావేశాo
చీరాల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ...
By Gadiyapudi Narendra 2026-01-28 11:57:17 0 282
Andhra Pradesh
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..
  తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్...
By Pagadala Venkateswar 2026-02-22 08:46:07 0 222
Andhra Pradesh
చౌడేపల్లి: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శెట్టిపేట సమీపంలో మంగళవారం పంట పొలాల్లోకి అదుపు తప్పి...
By Kothuru Murali 2026-06-02 15:31:22 0 122
Andhra Pradesh
టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు...
By Pagadala Venkateswar 2026-04-27 05:39:25 0 120
Andhra Pradesh
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
By Gadiyapudi Narendra 2025-12-27 16:11:37 0 513
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com