అమ్మకానికి ఏపీ పట్టణాలు దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను

0
199

*అమ్మకానికి ఏపీ పట్టణాలు*

 

*దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను*

 

*వ్యాపార సంస్థలుగా మున్సిపాలిటీలు*

 

*వికసిత్ ఏపీ పేరిట వినాశకర ప్రైవేటీకరణ విధానాలు*

 

*మున్సిపల్ స్థలాలు, సర్వీసులను ప్రైవేటేకరిస్తూ జీవో 673 విడుదల*

 

*ప్రతి పనికి రేటు కట్టి ఫీజులు వసూలు చేయనున్న మున్సిపాలిటీలు*

 

*ఖాళీ స్థలాలు, కాంప్లెక్స్లు, కార్యాలయాలు.. సర్వం 99 ఏళ్లకు బడా కంపెనీలకు లీజులు*

 

*జీవో 673 ఉపసంహరించాలి, లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం*

 

-సిహెచ్ బాబురావు, సిపిఎం

 రాష్ట్ర కార్యదర్శి వర్గ

 సభ్యులు 

 

#నేడు విజయవాడలోని

 సిపిఎం కార్యాలయంలో

 జరిగిన పత్రికా విలేకరుల

 సమావేశంలో బాబురావు,

 రాష్ట్ర కమిటీ సభ్యులు డి.

 కాశీనాథ్ తో కలిసి

 మాట్లాడారు*

 

#బాబురావు మాట్లాడుతూ.....

 

*రాష్ట్రంలో కూటమి, ఎన్డీఏ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 673 విడుదల చేయటం శోచనీయం*

 

*వికసిత్ భారత్, ఏపీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినాశకర విధానాలు చేపట్టడం దుర్మార్గం*

 

*రాష్ట్రంలోని 123 కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలోని ఆస్తులను బడా కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవటం గర్హనీయం*

 

*మున్సిపల్ స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, కార్యాలయాలు, పార్కులు, ఆడిటోరియంలు, స్టేడియంలు... సర్వం.. కారు చౌకగా ప్రైవేటీకరణ ముసుగులో బడా సంస్థలకు దఖలుపరిచే ప్రయత్నాలు ప్రమాదకరం*

 

*మంచినీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు మొత్తం పౌర సేవలను వ్యాపార పరం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం హానికరం*

 

*గత ప్రభుత్వంలో రుద్దిన చెత్త పన్నును, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు, పోరాడారు, ఫలితంగా చెత్త పన్ను రద్దయింది*

 

*కూటమి ప్రభుత్వం యూజర్ చార్జీల పేరుతో చెత్త పన్ను, మంచినీరు, డ్రైనేజీ తదితర పౌర సేవలు అన్నింటి పైన భారం వేయటానికి ఆదేశాలు ఇవ్వటం నమ్మకద్రోహమే*

 

*ఒకవైపున పేదలకు పట్టాలిస్తాం అని.. మురిపిస్తూ.. మరోవైపున పేదల మురికివాడలను తొలగించి, ప్రైవేట్ కంపెనీల స్థలాలను కట్టబెట్టి పేదల పొట్ట కొట్టడానికి కూటమి సర్కార్ కుట్ర పన్నుతోంది*

 

*పట్టణాభివృద్ధికి 45 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమని.. ప్రభుత్వం వాటిని సమకూర్చలేదనే సాకుతో.. పట్టణాలను బడా సంస్థల దయాదాక్షిన్యాలకు వదిలిపెట్టడం తగదు*

 

*పట్టణాలలో పౌర సదుపాయాలను కల్పించలేక ఎన్డీఏ ప్రభుత్వం చేతులెత్తేయటం బాధాకరం*

 

*పట్టణ స్థానిక సంస్థలను కార్పొరేట్ సంస్థలుగా చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది*

 

*పౌర సదుపాయాలన్నిటిని వ్యాపార సరుకులుగా మార్చుతోంది*

 

*ప్రజల ఆస్తులను బడా కంపెనీలకు కట్టబెట్టటమే కాకుండా, వయబుల్ గ్యాప్ ఫండింగ్ పేరుతో వారికి ప్రభుత్వ నిధులను కూడా సమకూర్చటానికి సర్కార్ ఆదేశాలు ఇవ్వటం తగదు*

 

*రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ 99 బ్రాండ్ గా మార్చుకున్నారు, 99 పైసలకే కార్పొరేట్లకు భూములు కట్టబెడుతున్నారు, ఇప్పుడు 99 సంవత్సరాలు పాటు మున్సిపల్ ఆస్తులను ధారధక్తం చేస్తున్నారు, 99 ప్రభుత్వంగా మారిపోయింది*

 

*కార్పొరేట్ విద్యాసంస్థలను నడుపుతున్న మంత్రి నారాయణ మున్సిపాలిటీలను కూడా కార్పొరేట్ సంస్థలుగా మార్చే ప్రయత్నాలు చేయటం దుర్మార్గం*

 

*అభివృద్ధి పేరుతో వినాశకర విధానాలను పాలకులు చేపట్టారు*

 

*ఒకవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాలలో పన్నులు వసూలు చేస్తూ, స్థానిక సంస్థలలో ప్రతి సంవత్సరం ఇంటి పన్ను 15% చొప్పున, ఐదేళ్లలో 130% పైగా పెంచారు*

 

*మళ్లీ ప్రతి పనికి రేటు కట్టి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం విచారకరం*

 

*మున్సిపల్ సర్వీసుల ప్రైవేటీకరణతో ఉద్యోగుల, కార్మికుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది*

 

*స్థానిక సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి*

 

*ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం లో రోడ్ల ప్రైవేటీకరణ ప్రారంభమైంది*

 

*విజయవాడలో వాణిజ్యసముదాయాలను అభివృద్ధి పేరుతో కూల్చడానికి సన్నాహాలు చేస్తున్నారు, భవాని ఐలాండ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఆర్టీసీ స్థలాలను లూలూ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు, బస్ డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు*

 

*రాష్ట్ర అభివృద్ధికి ,ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన జీవో 673 ఉపసంహరించాలి*

 

*దీనికి వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుంది, ప్రజలందరూ ఈ విధానాలను నిరసించాలి*

 

#కాశీనాథ్ మాట్లాడుతూ..

 

*ప్రజల ఆస్తులను సొంత సొమ్ము లాగా కేటాయింపులు చేయటం పాలకులకు తగదు*

 

*మున్సిపాలిటీలలో వాహన డిపోలలో ప్రైవేటు వాహనాలను ప్రవేశపెట్టి కార్మికులను దెబ్బతీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి*

 

*పిపిపి ముసుగులో రోడ్లను ప్రైవేటు కంపెనీలకి కట్టబెడుతూ నడకను వ్యాపారంగా మారుస్తున్నాయి*

 

*యూజర్ చార్జీలో ముసుగులో ప్రజలపై భారాలు వేయటం తగదు*

 

*ఐక్య ఉద్యమం ద్వారా వీటిని తిప్పి కొడతాం.*

Search
Categories
Read More
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:42:07 0 547
Andhra Pradesh
Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ కిడ్నాపర్లను గంటన్నరలో...
By Pagadala Venkateswar 2026-02-04 07:34:06 0 197
Telangana
వరంగల్ తొలి మహిళ సిపి గా శ్వేతా రెడ్డి నియమితులయ్యారు...
భారత్ అవాజ్ న్యూస్:  30 జూన్ రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో తొలి మహిళా కమిషనర్గా...
By Gujile Ramu 2026-06-30 01:16:20 0 201
Andhra Pradesh
మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ.
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్...
By Pagadala Venkateswar 2026-01-28 10:02:51 0 182
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 481
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com