వినయ్ గార్డెన్స్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సీఎం బందోబస్తు సమీక్షా సమావేశం.

0
414

🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

కాగజ్‌నగర్: రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్స్ నందు పోలీస్ అధికారులతో ప్రత్యేక బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి ఒక్క అధికారి మరియు సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పట్ల కచ్చితమైన నిబద్ధతతో వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు వీఐపీ సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ సమన్వయ బ్రీఫింగ్ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) చిత్రరంజన్, స్థానిక డీఎస్పీలు మరియు ఇతర ఉన్నతాధికారులతో పాటు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Matsyakarula seva padakkam
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల...
By G k Nookala 2026-05-18 13:01:07 0 175
Andhra Pradesh
పేదల కష్టాల్లో ప్రభుత్వము సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
పేదల కష్టాల్లో ప్రభుత్వం అండగా… సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ దర్శి టిడిపి కార్యాలయంలో...
By Chennaiah Kati 2026-06-24 15:24:18 0 96
Andhra Pradesh
వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ
సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి...
By Ratna Sekhar 2026-03-04 18:24:45 0 2K
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:42:07 0 555
Andhra Pradesh
Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?
ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది....
By Siva Bhaskar 2025-12-26 04:18:40 0 686
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com