ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో టీచర్లతో పని చేపించిన ఆదోని నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

0
239

ఆదోని పట్టణంలో కార్పొరేట్ నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్లు పేరుతో క్యాంపెయిన్ టీచర్లతో పని చేయించుకోవడం అలాగే ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా ఆధార్ కార్డ్స్ తో అడ్మిషన్లు చేయించుకుంటూ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్,బూట్లు, మరియు అనేక రకాలుగా టెక్నో కోర్సులు మరియు ఒలంపియాడ్ పేర్లతో. విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అధిక ఫీజులు ను దోపిడి చేస్తూ వసూలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో నారాయణ పాఠశాలలో ఎక్కడో ర్యాంకులు సాధిస్తే మా పాఠశాలకు ఇంత ర్యాంక్ వచ్చిందని ఆదోని పట్టణంలో నారాయణ పాఠశాల టీచర్లతో పాంప్లెట్లు పంచుతూ ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా ఫీజులు పట్టిక కూడా లేకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం చేసుకుంటూ విద్య అంటే అంగట్లో సరుకుగా మార్చడం జరిగింది. విద్యహక్కు చట్టాన్ని నీరు కారుస్తున్నటువంటి నారాయణ పాఠశాలపై తక్షణమే ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF)విద్యార్థి సంఘంగా ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరుతున్నాము.లేని ఎడల నారాయణ పాఠశాల ముందు విద్యాశాఖ కార్యాలయాలు ముందు దశల వారి కార్యక్రమాలకు సిద్ధమవుతాం అని, తెలియజేస్తున్నాము.

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 207
Bharat Aawaz
Our Mission: From Silence to Strength. .
In a world of noise, the stories that matter most often go unheard. They are lost in remote...
By Bharat Aawaz 2025-07-08 18:42:24 0 1K
Andhra Pradesh
ఏపీలో విభిన్న వాతావరణం.. కోస్తాలో వానలు, సీమలో భగభగలు.
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు రాయలసీమలో ఎండలు...
By Pagadala Venkateswar 2026-04-09 04:48:21 0 198
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:29 0 98
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో క్యూలైన్ కష్టాలు: రోగుల ఆవేదన.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-04-22 03:05:48 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com