చింతూరు సిహెచ్ సూపర్డెంట్ ఎంవీ కోటిరెడ్డి పదవి విరమణ!

0
254

పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.వి. కోటి రెడ్డి గారు ఈరోజుతో తన సుదీర్ఘ సేవలకు విరామం ప్రకటించారు. ఆయన పదవీ విరమణ సభ అత్యంత వైభవంగా జరిగింది. చింతూరు మారుమూల గిరిజన ప్రాంతం. ఇక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో డాక్టర్ కోటి రెడ్డి గారు చేసిన కృషి ఎనలేనిది. ఎంబిబిఎస్ పూర్తి చేసి, ఎంతోమంది పేద రోగుల గుండెల్లో దేవుడిగా నిలిచారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.సభలో పాల్గొన్న ప్రముఖులు ఆయన చేసిన నిరంతర సేవలను, రోగుల పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రత్యేకంగా కొనియాడారు. గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులు సరిగా లేకపోయినా... వెనకడుగు వేయకుండా డాక్టర్ కోటి రెడ్డి గారు అందించిన ఉచిత, నాణ్యమైన వైద్య సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకున్నారు. శాలువాలు, పూలమాలలతో ఆయనను ఘనంగా సత్కరించి, భావోద్వేగాల మధ్య వీడ్కోలు పలికారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఆర్మూర్ లో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాం!   గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ...
By Sadaq Sadaq 2026-09-05 15:45:34 0 191
SURAKSHA
Alka Tiwari, IAS: The Visionary Behind Jharkhand's Progress
The Journey Begins "True leadership is measured not by authority, but by the positive change it...
By Fathima Safa 2026-07-28 12:31:05 0 185
Prop News
PROPIINN:- Redefining Real Estate for a Smarter Tomorrow
PROPIINN: Redefining Real Estate for a Smarter Tomorrow In a world where real estate is both a...
By Hazu MD. 2025-05-19 11:41:58 0 3K
BMA
Puzzles Over Paywalls: The Game-First Retention Strategy
Taking inspiration from global models, Indian digital publishers in 2026 are developing daily...
By JoinBMA 2026-08-21 18:48:45 0 345
Telangana
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.
బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్...
By Sidhu Maroju 2025-07-02 13:43:06 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com