కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ జోన్లపై జిల్లా ఎస్పీ నితికా పంత్ కీలక ఆదేశాలు!

0
725

🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్, కెరమెరి పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ నితికా పంత్ భారీ ఆంక్షలు మరియు ట్రాఫిక్ నిబంధనలను జారీ చేశారు. అధికారిక రూట్ మ్యాప్ ప్రకారం, ప్రజల సౌకర్యార్థం భారీ పార్కింగ్ స్థలాలను కేటాయించారు. దీని ప్రకారం, ఆసిఫాబాద్ రూట్ నుండి వచ్చే వాహనాల (బస్సులు, వ్యాన్‌ల) కోసం అత్యధికంగా 27 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని, మంచిర్యాల రూట్ నుండి వచ్చేవారి కోసం ఇందిరానగర్ దాటిన తర్వాత 12 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని (అదనపు పార్కింగ్‌తో కలిపి), మరియు కాగజ్‌నగర్ రూట్ నుండి వచ్చేవారి కోసం కన్యకా కాటన్ మిల్లు సమీపంలో 8 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ ఎవరికి కేటాయించిన స్థలాల్లోనే వాహనాలను నిలపాలని, సీఎం పర్యటన ముగిసేవరకు రోడ్లపై ఎలాంటి వాహనాలను నిలపరాదని, పశువులను రోడ్లపైకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. అలాగే సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి కెరమెరి - ఆసిఫాబాద్ ఇరువైపులా, అలాగే కాగజ్‌నగర్ - ఎక్స్ రోడ్ వద్ద 2 ఎకరాల్లో ప్రత్యేక వేదిక (డైస్) పార్కింగ్, విఐపి మరియు జనరల్ గ్యాలరీలను ఏర్పాటు చేశామని, అత్యవసరాల కోసం టోవింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచామని తెలుపుతూ, ప్రజలందరూ పోలీసులకు సహకరించి పర్యటనను విజయవంతం చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Telangana
Ex MLA ibrahimpatnam passes away
Kondigari Ramulu, the former MLA of Ibrahimpatnam, passed away on March 13, 2026, at the age of...
By G k Nookala 2026-03-13 16:57:26 0 469
Andhra Pradesh
పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ
పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాలలో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు...
By Kothuru Murali 2026-01-13 09:07:30 0 224
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పాపం చిన్న పాపమ్మ
పుంగనూరు నియోజకవర్గం, సదుం విద్య వనరుల కేంద్రం వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ (90) దయనీయ...
By Kothuru Murali 2026-03-06 11:32:56 0 205
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక...
By Kothuru Murali 2026-02-11 08:45:53 0 189
SURAKSHA
T. S. Divakara IAS: Leading Telangana's Development
A Dynamic IAS Officer Driving District Administration Through Technology, Transparent Governance,...
By Lokeshwari Panthadi 2026-07-15 13:29:14 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com