విద్యుత్ ఘాతం ప్రమాదటపు అంచుల్లో అజిత్ సింగ్ నగర్ ప్రజలు

0
149

*ప్రెస్ నోట్* 

 

ది.30.05.2026,

విజయవాడ.

 

⚡ *విద్యుత్ ఘాతం ప్రమాదపుటంచుల్లో అజిత్ సింగ్ నగర్ ప్రజలు..* 

 

⚡ *రక్షణ కవచాలు లేకుండా ప్రమాదకరంగా ఉన్న హై ఓల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లు..* 

 

⚡ *చిన్నారులను వాహనదారులను మూగజీవాలను విద్యుత్ ఘాతానికి గురి కాకుండా తక్షణమే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ప్రొటెక్షన్ ఫెన్సింగ్లను ఏర్పాటు చేయాలి.* 

 

 _*ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ డిమాండ్.*_ 

 

ఈరోజు ఎన్ ఎస్ యు ఐ స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ను సందర్శించడం జరిగిందని..

 

 అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఏ రోడ్డు చూసిన హై ఓల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ప్రొటెక్షన్ ఫెన్సింగ్ లేకుండా చాలా ప్రమాదకరంగా ఉన్నాయని..

 

ముఖ్యంగా ప్రజలు, పిల్లలు, రోడ్డుపై వెళుతూ అదుపుతప్పిన వాహనదారులు మరియు జంతువులు అనుకోకుండా దగ్గరగా వెళ్లి తాకితే తీవ్రమైన షాక్ తగిలి ప్రాణాపాయం కలగవచ్చు.

 

పిల్లల భద్రత సమస్య పిల్లలు ఆటలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లి తాకే ప్రమాదం ఎక్కువ శాతం లో ఉందనీ..

 

పశువులు లేదా జంతువులు ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకితే అవి షాక్‌కు గురవుతాయి. కొన్నిసార్లు ఇది షార్ట్ సర్క్యూట్‌కు కూడా కారణం అవుతుంది.

 

అగ్ని ప్రమాదం (Fire Hazard)

ట్రాన్స్‌ఫార్మర్‌లో లోపం వచ్చినప్పుడు స్పార్కింగ్ లేదా ఆయిల్ లీక్ అవడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి అగ్ని చుట్టుపక్కలకి వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంటుందని..

 

ప్రమాదవశాత్తు వాహన ఢీకొనడం ట్రాన్స్‌ఫార్మర్ రోడ్డుకు దగ్గరగా ఉంటే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంటుందనీ..

 

ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఉండటం భద్రతకు చాలా అవసరం ఉందని ఇది ప్రజలను, జంతువులను రక్షించడమే కాకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను కూడా కాపాడుతుందనీ..

 

కావున విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే చిన్నారులు వాహనదారులు జంతువులు ప్రమాదపు అంచుల్లోకి వెళ్లకుండా ముందుగానే ప్రమాదకరంగా ఉన్న హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్లకు ప్రొటెక్షన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ దాని విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎస్ యు ఐ) నగర ప్రజల తరపున ఎలాంటి పోరాటాలు చేయడానికి అయినా వెనుకాడబోదని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయడమైనది.

Search
Categories
Read More
Andhra Pradesh
మరోసారి యూరప్ పర్యటనకు జగన్.. షరతులతో సీబీఐ కోర్టు అనుమతి.
  కుటుంబంతో కలిసిన యూరప్ పర్యటనకు వెళ్లనున్న జగన్ 15 రోజుల పర్యటనకు సమ్మతి తెలిపిన...
By Pagadala Venkateswar 2026-09-19 06:39:40 0 42
SURAKSHA
Srikant Nagulapalli, IAS: Leading Digital Governance
A Visionary Civil Servant Leading Innovation, Public Policy, and Citizen-Centric Administration...
By Lokeshwari Panthadi 2026-07-13 10:42:45 0 236
Andhra Pradesh
పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర...
By Kothuru Murali 2026-01-21 10:43:56 0 238
Andhra Pradesh
జిల్లాలో విస్తారంగా ఖనిజ సంపద ఉంది: మంత్రి కొల్లు రవీంద్ర.
అన్నమయ్య జిల్లాలో బైరటీస్‌తో పాటు పలు విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయని రాష్ట్ర గనులు,...
By Pagadala Venkateswar 2026-06-12 04:31:13 0 106
SADHANA
Global Summit Unveils AI Ethical Framework for K-12 Classrooms
At the Global Education Summit in London, UNESCO and international education ministers finalized...
By Dunna Jessicaruth 2026-05-20 06:08:41 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com