"ఈజీ మనీ కోసం నేరాల బాట.. చైన్ స్నాచర్ల ముఠా కటకటాల్లోకి.|

0
186

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ, మత్తుకు బానిస కావడంతో నలుగురు యువకులు నేరాల బాట పట్టి చివరకు పోలీసుల చేతికి చిక్కారు. ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన ఈ యువకులు ఆటోలు నడుపుతూ, వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

గత నెల రోజులుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, ఒంటరిగా వెళ్తున్న వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని పరారవుతూ వచ్చింది. వరుస ఘటనలతో ఆందోళన చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసులు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటన స్థలాల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించి వారి జాడను కనిపెట్టారు.

పక్కా సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోచుకున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన జీడిమెట్ల పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
కనకదుర్గ అమ్మవారి గుడిని పట్టించుకోని ఆలయ నిర్వాహకులు
చిలుకూరు మండలం బేతవోలు గ్రామం లో కొలువైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మ వారి గుడి, అంగరంగ వైభవంగా...
By Nookapangu Manikanta 2026-05-22 08:52:07 0 322
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే...
By John Baji 2026-01-02 12:57:34 0 223
Andhra Pradesh
మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.
మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్,...
By Pagadala Venkateswar 2026-03-03 08:55:05 0 189
Telangana
భద్రాచలంలో కొనసాగుతున్న బంద్: బస్టాండ్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు
భద్రాచలం: రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో బంద్ ప్రశాంతంగా, అయితే...
By Lakavath Kiran 2026-04-22 01:42:19 0 617
Andhra Pradesh
శ్రీ రామా నవమి వేడుకలకు పాల్గొన ఈస్ట్ mla మహ్మద్ నజీర్ గారు
పాత గుంటూరు మణి హోటల్ దగ్గర ఉన్న శ్రీ రామాలయం దగ్గరకు వచ్చిన టీడీపీ MLA మహ్మద్ నజీర్ గారు హాజరు...
By Kola Kirankumar 2026-03-27 13:49:39 0 558
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com