చింతూరు: అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి!

0
250

చింతూరు మండలం తిమ్మరిగూడెం గ్రామానికి చెందిన సునీత అనే గర్భిణికి శనివారం అకస్మాత్తుగా ప్రసవ వేదన మొదలైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి (CHC) తరలించారు.అయితే అక్కడ పరిస్థితి కాస్త సంక్లిష్టంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు ఆమెను భద్రాచలం ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమయం లేదు.. నొప్పులు ఎక్కువవుతున్నాయి.. వెంటనే 108 వాహనంలో ఆమెను భద్రాచలం తరలించే ప్రయత్నం చేశారు.ప్రయాణం సాగుతుండగానే.. మార్గం మధ్యలో సునీతకు నొప్పులు తీవ్రమయ్యాయి. 108 సిబ్బంది అయిన ఎం. వెంకట్, ఏ. వెంకట్ ఏమాత్రం కంగారు పడకుండా చాకచక్యంగా వ్యవహరించారు. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు.సిబ్బంది సమయస్ఫూర్తితో సునీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందిపై స్థానికులు మరియు కుటుంబ సభ్యులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Tamilnadu
"హాస్టల్ నిర్వాహకులపై దాడి: బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు!"
హైదరాబాద్ : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై పంజాగుట్ట పోలీస్...
By Sidhu Maroju 2026-05-21 11:54:42 0 181
Andhra Pradesh
శరవేగంగా శంకర్ విలాస్ ఆర్‌ఓబి పనులు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణ పనులను...
By John Baji 2026-01-02 12:14:55 0 245
Madhya Pradesh
Citizen Rights Violated: Dalit Youths Subjected to Custodial Torture in Madhya Pradesh
Bhopal, Madhya Pradesh:In a deeply disturbing case that highlights the misuse of authority and...
By Citizen Rights Council 2025-07-21 06:42:10 0 2K
Andhra Pradesh
మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు
జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..   దివ్యాంగులకు ఉపాధి అవకాశం  ...
By Manda Ramkumar 2026-03-25 09:04:23 0 219
Prop News
Welcome to PROPIINN – Your Dream, Our Vision
In today’s real estate world, confusion often outweighs clarity. Searching for a flat?...
By Hazu MD. 2025-05-19 11:42:25 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com