సముద్ర గర్భం కుచించిపోతోంది నానాటికి మన అడవులు అంతరించిపోతున్నాయి

0
114

సముద్ర గర్భం కుచించుకుపోతుంది.. నానాటికి మడ అడవులు అంతరించిపోతున్నాయి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. సముద్ర తీరo వెంబడి గ్రామాల ప్రజల రక్షణ దినదిన గండంగా మారుతుంది. కొందరి స్వార్థపరుల దురాక్రమణ, భూ కబ్జాదార్ల మితిమీరిన బూదాహం, అక్రమార్జన.. దోపిడీ... కొందరి స్వార్థ రాజకీయపరుల స్వలాభాలు.. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వంటి కారణంగానే సముద్రం వెంబడి ప్రభుత్వ, పంచాయితీ ఫారెస్ట్, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇలా కాలోనే చట్టాల ఉల్లంఘన.. పర్యావరణ విఘాత చర్యలు.. భూకబ్జాలు చోటు చేసుకోవడం కోసమెరుపు.!

 బందరు రూరల్ మండలం, పెదపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని 181, 182/1,182/2,155/A155/B లలో సుమారు 40 ఎకరాల గ్రామపంచాయతీ ఆస్వాదిన అసైన్డ్, దిబ్బ, ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. ఆక్రమణదారులు సముద్రానికి రక్షణగా ఉన్న మడ అడవులు నరికివేసి ఆ భూముల్లో చెరువులు తవ్వారు. ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో తమకున్న 16 సెంట్లు భూమిని చూపుతూ ఈ భూకబ్జాకు పాల్పడినట్లు సమాచారం.

*సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాతర.. CRZ నిబంధనలకు విరుద్ధం.

 పెదపట్నంలో యదేచిగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాతరేస్తున్నారు. సి ఆర్ జెడ్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. మార్గదర్శకాలు.. సి ఆర్ జెడ్ జోన్ వన్ నిబంధన ప్రకారం సముద్రానికి 500 మీటర్ల లోపు ఎలాంటి ఆక్రములకు పాల్పడకూడదు. మడ అడవులు నరకడం, భూముల ఆక్రమించి చెరువులు తవ్వడం, పర్యావరణానికి విగాతం కలిగించడం, వన్యప్రాణులకి నష్టం కలిగించే చర్యలు చేపట్టడం చట్టరీత్యా కఠిన నేరం. ఇవేమీ పట్టకుండా బంటుమిల్లి కి చెందిన ఓ న్యాయవాది పట్టపగలే మడ అడవులు నరికి చెరువులు తవ్వి భూ కబ్జాకు పాల్పడి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సవాల్ విసరడం ఇక్కడ కొస మెరుపు. ఆక్రమణలతో సముద్రం ఘోషిస్తున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం.

* జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు 

..................

 పెదపట్నంలో భూముల ఆక్రమణ, మడ అడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సి ఆర్ జెడ్ జోన్ వన్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది జీవీ రమణ జిల్లా కలెక్టర్ బాలాజీ ని కలిసి ఫిర్యాదు అందజేశారు. అంగర రంగనాథ్, అంగర రామ్మోహన్ రావు, అంగర వెంకట నవీన, అంగర రమాదేవి, అంగర రజిని, అంగర అరుణ్ కుమార్ లు ఈ ఆక్రమణకు పాల్పడి మడ అడవులు నరికి చెరువులు తవ్వారని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన...
By Sidhu Maroju 2025-11-12 16:09:51 0 308
Telangana
రైతులు నూతన పద్ధతులను పాటించాలి, వ్యవసాయ శాస్త్రవేత్తలు
సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్...
By Nookapangu Manikanta 2026-05-13 11:26:01 0 185
Jharkhand
Jamshedpur Expands Didi Cafés to Empower Women
The Jamshedpur administration is aggressively scaling up the 'Didi Cafés' initiative, a...
By Lokeshwari Panthadi 2026-07-02 05:12:18 0 109
BMA
Repackaged Sedition: BNS 152 Threatens Press Freedom
The transition from the colonial-era IPC to the Bharatiya Nyaya Sanhita (BNS) was supposed to end...
By JoinBMA 2026-08-21 08:19:47 0 151
Andhra Pradesh
రాఘవేంద్ర పాఠశాలలో ఘనంగా 17వ వార్షికోత్సవం
చీరాల పట్టణంలోని రాఘవేంద్ర హైస్కూల్ నందు 17వ వార్షికొత్సవ వేడుకలు కరస్పాండెంట్ మణికుమార్...
By Vadlamudi NagaVenkat 2026-04-03 11:53:19 0 308
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com