అట్టహాసంగా ప్రారంభ‌మైన మ‌హానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు.

0
100

 

అట్టహాసంగా ప్రారంభ‌మైన మ‌హానాడు.. జెండా ఎగరేసిన చంద్రబాబు

Andhra

Chandrababu Naidu Launches TDP Mahanadu 2026 in Amaravati

అమరావతిలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026 వేడుకలు

పూర్తిగా వర్చువల్ విధానంలో, సాంకేతికత సాయంతో నిర్వహిస్తున్న సభలు

ఈ ఏడాది ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత

మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్న పార్టీ నాయకత్వం

కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు, లోకేశ్

తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభ ‘మహానాడు-2026’ అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను పార్టీ శ్రేణులు ‘పసుపు పండుగ’గా అభివర్ణిస్తున్నాయి.

 

వర్చువల్‌గా కార్యకర్తలతో మమేకం 

ఈసారి మహానాడును పూర్తిగా సాంకేతికత ఆధారంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తుండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1875 క్లస్టర్లకు గాను 1851 క్లస్టర్లను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేశారు. ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక క్లస్టర్‌ను టు-వే కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా నేరుగా అనుసంధానించి, కార్యకర్తలతో నేతలు ముఖాముఖిగా మాట్లాడనున్నారు.

 

‘స్త్రీ శక్తి’ నినాదంతో టీడీపీ మహానాడు 

ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ అనే ప్రధాన థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పార్టీ నిర్మాణంలో వారి పాత్ర, సామాజిక సేవలో భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు ‘కార్యకర్తే అధినేత’, ‘యువగళం’, ‘పేదల సేవలో టీడీపీ’ వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ఈ మహాసభల్లో మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.

 

కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆయన తర్వాత మంత్రి నారా లోకేశ్ ప్రసంగిస్తారు. రాబోయే రాజకీయ వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై తమ ప్రసంగాల ద్వారా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ మహానాడు ద్వారా గ్రామస్థాయి కార్యకర్తలతో అనుసంధానం పెంచుకుని, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Soil Health Watch: DIY Probes Uncover Toxic Farm Runoff
Untreated industrial discharge and unregulated chemical fertilizers severely damage agricultural...
By JoinBMA 2026-08-22 07:54:55 0 128
Andhra Pradesh
కొత్త ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి
18 సంవత్సరాల నిండిన యువతి, యువకులు అందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పాచిపెంట తహశీల్దార్...
By Boiena Rajesh 2026-08-30 07:17:37 0 107
Telangana
Reactor Blast at Sigachi Industries Kills Dozens, Halts Operations
Pashamylaram, Telangana - On June 30, 2025, a massive explosion tore through the...
By Bharat Aawaz 2025-07-01 05:42:38 0 1K
Andhra Pradesh
టిఆర్ఎస్ పదవికి వన్నె తేవాలి
*జేఎస్ఆర్ పదవికి వన్నె తేవాలి...*   ************************* మంగళగిరి ఆర్ఆర్ టవర్స్ లోని...
By Rajini Kumari 2026-02-05 09:15:34 0 203
SURAKSHA
Sudhir Rajpal, IAS: Driving Haryana's Growth with Vision
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Sudhir Rajpal has played a...
By Lokeshwari Panthadi 2026-07-24 08:04:39 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com