చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.

0
148

అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో ఘటన

ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

ఆపదలో ఉన్నామని ఆదుకోవాలని కోరిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి అండగా నిలిచారు. వినతి స్వీకరించిన 24 గంటల్లోనే సహాయం మంజూరు చేసి, తన మార్క్ పాలనను మరోసారి చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 16న 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నరసన్నపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్‌నగర్‌కు చెందిన గొర్లె జ్యోతి, సింహాద్రి భాస్కరరావు దంపతులు సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నామని, వైద్య ఖర్చులకు ఉన్నదంతా అయిపోయిందని, తమను ఆదుకోవాలని వేడుకున్నారు. వారి పరిస్థితికి వెంటనే చలించిన చంద్రబాబు, తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 

ఆయన చెప్పినట్టుగానే, మరుసటి రోజే (మే 17న) ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి శ్రీకాకుళం కలెక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. బాధితులిద్దరికీ సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. ఈ చెక్కులను నిన్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎం సహాయ నిధి ద్వారా రూ. 3 కోట్లు అందించామని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు...
By Sidhu Maroju 2025-09-18 08:42:37 0 358
Telangana
అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్  కొరకు...
By Nookapangu Manikanta 2026-04-25 12:02:25 0 176
Telangana
కరీంనగర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా...
By Sunka Santhosh 2026-06-01 17:47:23 0 134
Dadra &Nager Haveli, Daman &Diu
Industrial Development and Investment Growth in Telangana
Telangana made notable progress in industrial development and investment promotion during 2026....
By Fathima Safa 2026-06-22 07:13:30 0 190
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మండలం కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లలో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు.
Madanapalle: మదనపల్లె మండలంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి తల్లి, కూతురు తీవ్రంగా గాయపడిన...
By Pagadala Venkateswar 2026-08-03 09:53:46 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com