అడవిలో చావు బతుకు మధ్య దొరికిన "అపరంజి" ఉపిరి పోసిన చింతూరు వైద్యులు!"

0
197

కన్నప్రేమ కరువైందో.. లేక ఆడపిల్ల అనే అనాగరికపు ఆలోచనో తెలీదు కానీ, పురిట్లోనే ఆ పసికందును అడవి పాలు చేశారు. శీతాకాలపు చలిలో, క్రూర జంతువుల మధ్య చింతూరు మండలం మదుగూరు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఒంటరిగా విడిచిపెట్టబడిన ఆ నవజాత ఆడ శిశువును అదృష్టవశాత్తూ జనవరి 19న ఆశా కార్యకర్తలు గుర్తించారు. వెంటనే స్పందించి ఆమెను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తెచ్చే సమయానికి ఆ పసికందు పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అయితే, అక్కడి వైద్య బృందం ఆ పాపను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది. సూపరిడెంట్ ఏం,వి. డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ మహేష్ ఆ శిశువుకు అత్యవసర చికిత్స అందించారు. క్షణాల మీద పోరాడి, ఆ చిన్నారికి ఊపిరి పోసి ప్రాణాలు కాపాడారు. వైద్యుల నిరంతర కృషితో ఆ పాప పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఆ చిన్నారిని తదుపరి సంరక్షణ కోసం ఐసీడీఎస్ (ICDS) అధికారుల ద్వారా పాడేరులోని ‘శిశు గృహ’కు సురక్షితంగా తరలించారు. అడవిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన పాపకు పునర్జన్మ ప్రసాదించిన చింతూరు ప్రభుత్వ వైద్యులను, ఆశా కార్యకర్తలను స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో కొలువుల జాతర: ఎస్సై, కానిస్టేబుల్ సహా 2,050 పోస్టుల భర్తీకి ప్రకటన.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి...
By Pagadala Venkateswar 2026-09-17 05:26:04 0 56
Rajasthan
Rajasthan Unveils Exciting Sports Calendar for 2026-27
The Department of Personnel, in collaboration with state sports agencies, has officially released...
By Lokeshwari Panthadi 2026-07-01 08:37:28 0 243
Ladakh
Kargil Airport to Start Commercial Flights Soon
In a significant boost to connectivity and tourism, Kargil Airport is all set to begin commercial...
By Bharat Aawaz 2025-07-17 06:32:47 0 1K
Andhra Pradesh
తమ్ముడి మృతిపై అన్న అనుమానం: పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన.
మదనపల్లి మండలం వలసపల్లికి చెందిన పురుషోత్తం శనివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తన...
By Pagadala Venkateswar 2026-02-28 11:18:42 0 193
Andhra Pradesh
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెం పట్టణం, అయ్యప్ప స్వామి గుడి వద్ద ₹9 కోట్ల నిధులతో మంజూరైన యర్రగొండపాలెం – త్రిపురాంతకం తారు రోడ్డు కార్
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు...
By Chennaiah Kati 2026-01-21 14:59:34 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com