ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే పాటించాలి

0
180

*ప్రతి శుక్రవారం ‘నాన్‌-వెహికల్‌ డే’ పాటించాలి*

*సైకిల్‌పై 2వ డివిజన్‌ 19 కీ.మీ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటన*

*2వ డివిజన్‌లో రూ.70 వేల స్వయం ఉపాధి వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*++++*

           ప్రతి శుక్రవారం ‘నాన్‌-వెహికల్‌ డే’గా ప్రభుత్వం ప్రకటించిందని, అందువల్ల ప్రజలందరూ ప్రతి శుక్రవారం తమ వాహనాలను ఉపయోగించకుండా ఇంధన పొదుపునకు సహకరించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కోరారు. వాహనాలను పక్కన పెట్టి సైకిల్‌ను తొక్కడం వల్ల డబ్బులు ఆదాతో పాటుగా కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు. 

 

శుక్రవారం ఉదయం శాసనసభ్యులు గద్దె రామమోహన్ 2వ డివిజన్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ శుక్రవారం ఉదయం ఇంటి వద్ద నుంచి సైకిల్ తొక్కుకుంటూ 2వ డివిజన్‌ వరకు వెళ్లారు. అక్కడ పర్యటించి, ప్రజా సమస్యలు తెలుసుకొన్న అనంతరం రామవరప్పాడు మీదుగా సైకిల్ పైనే తూర్పు నియోజకవర్గ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం 19 కిలోమీటర్లు సైకిల్ పైనే పర్యటించి మధ్యమధ్యలో చిరువ్యాపారాలు చేసుకునేవారితోను, ప్లాట్‘ఫారం రిక్షా తొక్కేవారితోను, ఇతరులతోను మాట్లాడుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

2వ డివిజన్ పర్యటనలో నిరుపేద కుటుంబాలకు చెందిన ముగ్గురికి స్వయం ఉపాధి చేసుకొనే నిమిత్తం రూ.70 వేలు విలువ చేసే రెండు తోపుడు బళ్లు, ఒక ఇస్త్రీ బండి, ఒక గ్రైండర్ పంపిణీ చేశారు. సింగరస్తు మస్తాన్‌కు ఇస్త్రీ బండిని, ఎం.విజయలక్ష్మికి గ్రైండర్‌ను, శ్రీరాములు, గోవిందుల సన్యాసిరావులకు రెండు తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో కోనుగోలు చేసి వారికి ఉచితంగా అందచేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ కొన్ని దేశాల అనాలోచిత నిర్ణయాల వల్ల యుద్దం జరిగిందని, దాని వల్ల ప్రపంచం మొత్తం గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ముడిచమురు ధరలు పెరగడం వల్ల అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. కొన్ని రోజుల పాటు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రజానీకానికి సూచించారని గుర్తుచేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, నారా లోకేష్‌లు కూడా వారి కాన్వాయ్‌లోని వాహానాల సంఖ్యను తగ్గించుకున్నారని వెల్లడించారు. అందులో భాగంగానే తాను కూడా ఈ రోజు సైకిల్‌పై డివిజన్‌ పర్యటనకు వచ్చానని చెప్పారు. ప్రతి శుక్రవారం ‘నాన్‌ వెహికల్‌ డే’ అని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. సైకిల్‌ను ఉపయోగించడం వల్ల ఖర్చు జీరో అని, డబ్బును ఆదా చేయడమే కాకుండా ఆరోగ్యం పొందవచ్చునని, కాలుష్యం తగ్గుతుందని శాసనసభ్యులు వివరించారు. సేవ ద్వారానే రాజకీయం అనేది టిడిపీ విధానమని గద్దె రామమోహన్ తెలిపారు. టీడీపీ కేవలం రాజకీయాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తోందని వివరించారు. సేవను ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసరి గాబ్రియేల్, సుఖసాని రత్నశ్రీ కృష్ణ ప్రసాద్, ముత్యాల కృష్ణ, దోమకొండ రవి, తాడి బాబూరావు, పడాల గంగాధర్, బండారుపల్లి అనిల్, షేక్‌ షకీలా, ఏడుకొండలు, వేమునేని రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
28:06:2026 పల్స్ పోలియో కార్యక్రమం
28.06.2026 | పల్స్ పోలియో కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కూటమి ప్రభుత్వ...
By Chennaiah Kati 2026-06-28 06:47:04 0 169
Andhra Pradesh
మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు...
By Boiena Rajesh 2026-07-18 05:14:43 0 159
Andhra Pradesh
రవీంద్ర కుమార్ గారికి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందనలు
కనకమేడల రవీంద్ర కుమార్‌కు దేవినేని ఉమామహేశ్వర రావు అభినందనలు   విజయవాడ: 25 డిసెంబర్...
By Rajini Kumari 2025-12-25 11:03:42 0 269
SURAKSHA
Ex-WB Cops: Cyber Crime Warriors After Retirement
Retired WB police officers have become cyber crime fighters for society. They conduct awareness...
By Kalaga Sailaja 2026-07-03 12:56:15 0 198
Andhra Pradesh
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు.
  అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-06-18 05:29:15 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com