గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి....!
Posted 2026-05-15 06:18:04
0
153
బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన....
భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం
ఖానాపురం మండలంలో గొర్రె పిల్లని కాపాడబోయి ఓ బాలుడు ప్రాణాలు...కోల్పోయిన ఘటన మండలంలోని రంగాపురం గ్రామంలో జరిగింది. పులిగిల్ల మల్లేష్ - మానస కొడుకు పులిగిల్ల రాఘవ (11) 5 వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంట్లో గొర్రె పిల్లలను మేపడా నికి పొలాల వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ గొర్రె పిల్ల మేత మేస్తూ బావి దగ్గరకు వెళ్లింది. గొర్రె పిల్ల బావిలో పడుతుందని బాలుడు గమనించి కాపాడబోయి బావిలో పడ్డాడు. గమనించిన స్థానికులు బావిలో వెతకగా బాలుడు ఆచూకీ చిక్కలేదు. సాయంత్రం 4 గంటల వరకు బావిలో వెతికి నీటిని తోడగా మృతదేహం లభ్యమైంది. ముక్కుపచ్చలారని బాలుడు మృతి రంగాపురం గ్రామంలో విషాదాన్ని నింపింది. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Dr. Arshinder Singh Chawla: Guardian Against Corruption
A distinguished 1994-batch Haryana Cadre IPS officer leading the Haryana State Vigilance &...
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా*
నందిగామ,ఎన్టీఆర్ జిల్లా
మదీనా...
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు...
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...
Sky Watchers: Citizens Exposing Illegal Sand Mining
Environmental journalists frequently lack the resources to monitor expansive riverbeds for...