బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ఇంచార్జీల వివరాలు

0
108

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం సుధీర్ఘంగా జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చించి సమావేశం నిర్ణయాలు తీసుకున్నది.

‎ముఖ్యాంశాలు :

‎1) ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI)  చేపట్టిన SIR ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని డిజిటలైజేషన్ పద్దతిలో జరపాలని, బిఆర్ఎస్ ప్రార్టీ ప్రధాన కార్యదరర్శుల సమావేశం అభిప్రాయ పడింది. 

‎2) ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ సమన్వయ కర్తను నియమించాలని  నిర్ణయించడం జరిగింది.

‎3)  ప్రతీ మండలాని, మున్సిపల్ బాడీల వారిగా, ‘సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను  రెండు మూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయం జరిగింది.

‎4) డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున, రాష్ట్రంలో వున్న 35,655 పోలింగ్ బూత్ లలో., బూత్ కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించాలని , ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల పై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయ పడింది.

‎5)  పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్దతిలో చేపట్టేందుకు తగిన  శిక్షణా శిభిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలని నిర్ణయం జరిగింది

‎సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించబడిన ఇంచార్జీల వివరాలు :

‎ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- శ్రీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ, ప్రధాన కార్యదర్శి.

‎జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – శ్రీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి 

‎ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు –

‎శ్రీమతి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి 

‎జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి. 

‎మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు-  శ్రీ గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి.

‎నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- శ్రీ గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.

‎మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.

‎ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు-  శ్రీ రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి.

‎వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.

‎మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు — శ్రీ మహమూద్ అలీ, మాజీ మంత్రి

‎గద్వాల్,నాగర్‌కర్నూల్,వనపర్తి జిల్లాలు— శ్రీ మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి

‎మేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు — శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్

‎హైదరాబాద్ జిల్లా— శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

‎నల్గొండ, సూర్యాపేట జిల్లాలు — శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి.

Search
Categories
Read More
Business & Finance
Remove Directors Smoothly with Expert Support
Removing a director requires following the legal process to ensure your company remains compliant...
By Navya Sree 2026-07-14 06:59:25 0 63
Andhra Pradesh
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు  కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
By Gadiyapudi Narendra 2026-01-07 10:07:30 0 202
Andhra Pradesh
ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది.
అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది  మహిళా ప్రయాణికులు దురుసుగా...
By Pagadala Venkateswar 2026-06-25 06:22:40 0 46
Andhra Pradesh
మదనపల్లెలో నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం.
మదనపల్లె–బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-18 06:22:29 0 153
SURAKSHA
శీర్షిక: ప్రజలతో మమేకమవుతున్న తెలంగాణ పోలీసులు - కమ్యూనిటీ పోలీసింగ్
తెలంగాణ పోలీసుల ప్రధాన లక్ష్యం ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం. ఈ క్రమంలో, పోలీస్ అధికారులు...
By Kalaga Sailaja 2026-07-01 07:24:53 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com