సింగరేణి గుర్తింపు సంఘం AITUC తో చర్చలు జరిపిన సింగరేణి డైరెక్టర్ (పా) : గౌతమ్ పొట్రూ

0
238

తేదీ 12/05/2026 :హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) శ్రీ గౌతమ్ పొట్రు , ఐఏఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారంపై యాజమాన్యం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సమావేశంలో గుర్తింపు సంఘం ప్రధాన నాయకులు కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించి ఈ క్రింది హామీలు ఇచ్చింది,మెడికల్ బోర్డును ఒక నెలలోపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.సొంత ఇంటి పథకంపై వచ్చే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి అమలు విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.పెర్క్స్ పై ట్యాక్స్ సమస్యను వచ్చే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి అమలు చేస్తామని పేర్కొన్నారు.కార్మికులు క్వార్టర్లు ఖాళీ చేసిన వెంటనే క్వార్టర్ వెకేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తామని తెలిపారు.పెండింగ్‌లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.గనులపై డిపెండెంట్ ఉద్యోగాల దరఖాస్తులను కేసు వారీగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లిన కార్మికుల వైద్య బిల్లులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.మూడు సంవత్సరాల నిబంధనకు సంబంధం లేకుండా ఖాళీలు ఉన్నచోట వెంటనే ట్రాన్స్‌ఫర్లు చేస్తామని తెలిపారు.మారుపేర్ల సమస్య ప్రభుత్వ స్థాయిలో చర్చించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.అండర్‌గ్రౌండ్ అలవెన్స్ కట్టింగ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.డిస్మిస్ అయిన ఇతర కార్మికుల సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.ఆసుపత్రుల్లో ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.ఓవర్‌మన్‌లకు పెండింగ్ ప్రమోషన్లు మంజూరు చేస్తామని తెలిపారు.అన్‌ఫిట్ అయిన మైనింగ్ మరియు ట్రేడ్స్‌మెన్ కార్మికులకు తగిన సూటబుల్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.రిటైర్డ్ కార్మికులకు నిలిపివేసిన లాభాల వాటా, దీపావళి బోనస్ PLR చెల్లించేందుకు అంగీకరించారు.గోల్డెన్ హ్యాండ్‌షేక్ లేదా VRS లాంటివి అమలు చేయబోమని డైరెక్టర్ స్పష్టం చేశారు.కాంట్రాక్టు కార్మికులు జనరల్ సమ్మెలో పాల్గొన్న వాళ్లకి పీనల్ వెజ్ కట్టింగ్ నిలిపివేస్తామన్నారు అదనంగా, మిగిలిన కీలక సమస్యలను త్వరలో సీఎండీ మరియు డైరెక్టర్ (పర్సనల్) స్థాయిలో జరిగే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం గుర్తింపు సంఘం AITUC నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు.ఈ డైరెక్టర్ పా తో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరీమి రాజ్ కుమార్ , అడిషనల్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి రైతు మృతి.
మదనపల్లెలోని ఒక ఆసుపత్రిలో గురువారం ఆపరేషన్ వికటించి రైతు శ్రీనివాసులు నాయుడు (51) మృతి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-28 06:47:56 0 103
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో సుజల వసతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నందవరం మండల నాయకులు
నందవరం మండలం కేంద్రం ఎస్సీ కాలనీలోని ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-04-13 09:43:26 0 191
Andhra Pradesh
డేవిడ్ కింగ్ మృతికి బిబిఎస్ కమిటీ ఘన నివాళులు పాలచర్లలో సంతాప సభలో దైవ సేవకుల భావోద్వేగ స్మరణ
ఇటీవల పరమపదించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు, ఆత్మీయులు ఎస్. డేవిడ్ కింగ్ స్మారకార్థం...
By Ratna Sekhar 2026-02-19 19:55:37 0 1K
BMA
LoRaWAN Tech: Sending News on Low-Power Networks
Tech-savvy newsrooms are experimenting with LoRaWAN (Long Range Wide Area Network) technology to...
By JoinBMA 2026-08-21 11:07:31 0 201
Andhra Pradesh
ఆడపిల్లల విద్యాభివృద్ధి దిశగా కీలక అడుగు – జడవల్లి అడ్డరోడ్డులో మద్రసా హాస్టల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.
పొన్నూరు మండలం, జడవల్లి గ్రామ సమీపంలో ముఫ్తి అబ్దుల్లా బేగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్...
By John Baji 2026-02-03 11:26:40 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com