మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలు

0
226

 తేదీ: 12-05-2026 (మంగళవారం) మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ శ్రీ చందన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పిన్నింటి రఘునాథ రెడ్డి  హాజరై నర్సింగ్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. నర్సులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతు ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సుల పాత్ర ఎంతో గొప్పది, రోగి బాధను తన బాధగా భావించి సేవ చేయడం ఒక మహోన్నతమైన పని. వైద్య రంగంలో డాక్టర్లతో సమానంగా నర్సులు కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన నర్సుల త్యాగం ఎప్పటికీ మరువలేనిది అని అన్నారు.అంతేకాకుండా ఆయన మాట్లాడుతు మనిషి జీవితంలో అత్యంత కష్టసమయంలో ముందుగా కనిపించే దేవత నర్స్. సేవే పరమోన్నత ధర్మమని నిరూపిస్తూ నర్సులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వైద్య సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని తెలిపారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్ , మంచిర్యాల కార్పొరేషన్ ప్రెసిడెంట్ తూముల నరేష్ , 52వ డివిజన్ కార్పొరేటర్  స్రవంతి కిషోర్ , మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి పెంట రజిత  పాల్గొని నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్ సెల్ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు నర్సింగ్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
BMA
“What Does Journalism With Purpose Mean Today?”
“What Does Journalism With Purpose Mean Today?” In today’s age of reels,...
By Media Academy 2025-05-04 09:02:00 0 6K
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Mining and Mineral Development
Madhya Pradesh continues to strengthen its mining and mineral sector by promoting responsible...
By Fathima Safa 2026-06-30 08:03:01 0 66
Andhra Pradesh
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్నికలు
*పత్రికా ప్రకటన*   *విజయవాడ, తేదీ: 19.01.2026*   *• ఏపీ మెడికల్ కౌన్సిల్ లో...
By Rajini Kumari 2026-01-19 11:23:45 0 182
Telangana
మహంకాళి బోనాలకు పటిష్ట భద్రత.|
● భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు.. సాఫీగా దర్శనం ● 10 క్రైమ్ టీమ్స్‌తో నిఘా.. జూలై 31...
By Sidhu Maroju 2026-07-25 14:40:42 0 142
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:49:01 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com