ఎమ్మిగనూరు MLA బివి జయ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో

0
382

ఎమ్మిగనూరు పట్టణంలోని మచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (MSZPH Girls School)లో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినుల సన్మాన కార్యక్రమం మరియు పతకాలు, ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని దీపప్రజ్వలనతో ప్రారంభించి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో 550కు పైగా మరియు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినులను పతకాలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేసిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక తమకు ఎంతో ఉపయోగపడిందని, ఉన్నత మార్కులు సాధించడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. విద్యార్థులను పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారానే పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. అలాగే ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందే స్థాయికి చేరుకోవడం గొప్ప విజయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులు, మార్కెట్ యార్డు చైర్మన్, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్, టీడీపీ పార్లమెంట్ నాయకులు, పట్టణ కమిటీ సభ్యులు, వార్డ్ కమిటీ సభ్యులు, క్లస్టర్ కన్వీనర్లు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?
వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా...
By Ponnala Srinivasrao 2026-04-03 15:18:46 0 265
Andhra Pradesh
రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో భారీ దోపిడీ.
మదనపల్లె శివార్లలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉన్న ఒక రిటైర్డ్ రూరల్ వాటర్ సప్లై (RWS)...
By Pagadala Venkateswar 2026-08-14 05:34:36 0 79
Andhra Pradesh
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-02-09 08:19:55 0 208
Telangana
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్కను టార్గెట్ చేశారా?
గోషి క‌ట్టుకున్న‌వాళ్లంతా వైఎస్ కాలేర‌ని సీఎం రేవంత్ ఎవ‌రిని ఉద్దేశించి...
By Ponnala Srinivasrao 2026-06-07 00:45:23 0 164
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల...
By Rajini Kumari 2026-02-20 14:42:15 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com