తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు

0
1K

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అనంతరం ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.ఈ సందర్బంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణా రావు గారు. మరియు మైనింగ్ కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. మాట్లాడుతూ.డాక్టర్, బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజలా స్రవంతి ప్రాజెక్ట్ (తుమ్మిడిహెట్టి బ్యారేజ్) కు అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి గారు 2008 లో భూమిపూజ చేశారని తెలిపారు. రూ 38.500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కు శ్రీకారంచుట్టరని గుర్తుచేసారు 106 కిలోమీటర్ల విస్తీర్ణంలో కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేయగా.71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ చేశారని.46 కిలోమీటర్ల కాల్వల పనులు పూర్తిచేసారని పెర్గోన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం.ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేసిందని విమర్శించారు. దింతో అంచనా వ్యయం గనణనియంగా పెరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నరు.మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే చర్చలు జరిపుతామని చెప్పారు. భూములు నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.ఈ నెల 10 న ప్రధాని నరేద్ర మోదీ గారు తెలంగాణ పర్యటన కు రానున్న నేపథ్యంలో బీజేపి ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టు అంశాన్ని అయన దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులు సూచించారు.వికసిత భారత్ అని చెప్పుతున్న కేద్రప్రభుత్వం పెద్దమనసుతో తెలంగాణ ప్రజలు రైతుల పక్షన నిలబడలని పిలుపునిచ్చారు.పెద్దమనసుతో మహారాష్ట్ర ప్రభుత్వం.కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు మెడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవాడంతో ఇప్పుడు ఆ జాలాల్ని వినియోగించుకునే అవకాశం లేదన్నారు.తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ గ్రావిటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తామని.అది కూడా ఒక్క యూనిట్ కరెంటూ వినియోగించకుండా నీటిని గ్రావిటి ద్వారా తీసుకెళ్తామన్నరు.ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే చర్చలు జరుపుటమని చెప్పారు.భూములు నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.ఈ సందర్బంగా.ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది తలపున జలాలు ఉన్న ఈ ప్రాంత రైతన్నలకు మేలు జరగకపోవడంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయాలని సీఎం రేవంతరెడ్డి గారు నిర్ణయించారని వెల్లడించారు.ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హరిత గారు ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ గారు గడ్డం వినోద్ గారు ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
SURAKSHA
నిమిషాల్లో మీ చెంతకు: తెలంగాణ బ్లూ కోల్ట్స్
నగరంలో ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా, కేవలం 100 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. రెప్పపాటులో...
By Kalaga Sailaja 2026-06-25 09:23:43 0 106
Telangana
​శ్రీరామనవమికి ముస్తాబైన దక్షిణ అయోధ్య: భద్రాద్రిలో వైభవంగా కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు
భద్రాచలం:  శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ...
By Lakavath Kiran 2026-03-18 14:57:16 0 733
Telangana
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,గౌతమి లయన్స్...
By Avunoori Mahesh 2026-04-12 09:03:51 0 282
BMA
Campus Crackdowns: Censoring the Next Generation of Press
Student journalists at universities are facing unprecedented retaliation and censorship from...
By JoinBMA 2026-08-19 11:00:27 0 141
SURAKSHA
Visionary Leader: The Inspiring Story of IPS Navdeep Singh Virk
Shaping Modern Law Enforcement: How IPS Navdeep Singh Virk’s Dynamic Leadership is...
By Kalaga Sailaja 2026-07-20 06:40:55 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com