విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు.

0
130

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల

ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు

సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కనెక్టివిటీలో ఒక చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా బలపడతాయని, రైళ్ల నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ మైలురాయి ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని, కనెక్టివిటీ మెరుగుపడి ప్రజలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఈ రైల్వే జోన్ ఏర్పాటును సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని నారా లోకేష్ గుర్తుచేశారు. ఆయన పట్టుదల వల్లే ఈ కల నెరవేరిందని, ఇందుకుగాను ముఖ్యమంత్రికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లోకేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
*శ్రీ జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు*    నకిలీ మద్యం కేసులో అక్రమంగా...
By Rajini Kumari 2026-01-20 10:45:12 0 202
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:02 0 388
Telangana
నిజామాబాద్
రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు 39 వ డివిజన్లో "స్పెషల్ టీమ్" ను ఏర్పాటుచేసి, కార్మికుల...
By Sadaq Sadaq 2026-06-06 10:16:18 0 157
Andhra Pradesh
సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో...
By Kothuru Murali 2026-05-03 16:37:11 0 137
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
By Kothuru Murali 2026-02-20 09:18:46 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com