నిరుద్యోగులకు శుభవార్త: ఏపీలో 529 వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన.

0
130

ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి ఆరోగ్య శాఖ ప్రకటన

ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు కూడా భర్తీ

జూన్ 13 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

ప్రభుత్వ ఆసుపత్రులు, యూపీహెచ్‌సీలలో ఖాళీల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగార్థులకు వైద్య, ఆరోగ్య శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, కాంట్రాక్టు ప్రాతిపదికన 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ జూన్ 13, 2026 నుంచి ప్రారంభం కానుంది.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సు పోస్టులతో పాటు 24 ఫార్మసిస్ట్, 86 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. మొత్తంగా 529 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఎంపికైన అభ్యర్థులను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHC), ప్రభుత్వ ఆసుపత్రులు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (NICU), జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ల వంటి వివిధ విభాగాలలో నియమించనున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం (11వ తేదీ) వెలువడిన ఈ ప్రకటన ప్రకారం, అర్హులైన అభ్యర్థులు జూన్ 30, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు మరియు ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలని అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Delhi - NCR
Delhi IGI Airport Security Earns Elite Global Renewal (55 characters)
The Central Industrial Security Force (CISF) has officially renewed its prestigious ISO 9001:2015...
By Lokeshwari Panthadi 2026-06-25 10:35:23 0 166
Andhra Pradesh
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్... శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం.
కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.3.9 కోట్ల...
By Pagadala Venkateswar 2026-01-22 14:37:56 0 206
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఇటీవలే ఆర్యవైశ్య పెద్దలు, ప్రముఖ రైస్ మిల్...
By Sadaq Sadaq 2026-05-14 15:19:20 0 142
Andhra Pradesh
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు,.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ...
By Chennaiah Kati 2026-06-24 10:54:08 1 98
SURAKSHA
Sanjay Kumar, IPS: A Symbol of Courage and Service
The Journey Begins "A great police officer is remembered not only for enforcing...
By Fathima Safa 2026-07-27 10:22:42 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com