"నేరేడ్మెట్, కౌకూర్-యాప్రాల్‌లో BRS హై వోల్టేజ్ మీటింగ్స్.|

0
287

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.

188 నేరేడ్మెట్, 189 కౌకూర్-యాప్రాల్ డివిజన్‌లలో జరిగిన ఈ సమావేశాలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ సహా పలువురు కీలక నాయకులు పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, డివిజన్ స్థాయి కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. 

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేకంగా SIR (Special Intensive Revision) ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించి ఓటర్ల హక్కులను కాపాడాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అభివృద్ధి పనులు సాధిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.

పార్టీ సభ్యత్వ రుసుములను ప్రకటిస్తూ సాధారణ సభ్యత్వం రూ.10, క్రియాశీలక సభ్యత్వం రూ.50గా నిర్ణయించినట్లు తెలిపారు.

సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఆయన, వాటిని గౌరవిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా నేరేడ్మెట్‌కు చెందిన యువ నాయకుడు సుమన్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో హాజరై సమావేశాలను విజయవంతం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం - ప్రాణాలను కాపాడుకుందాం:ఎస్.ఐ పవన్ కుమార్
చీరాల పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరియు ప్రజల్లో ట్రాఫిక్ క్రమశిక్షణను...
By Vadlamudi NagaVenkat 2026-04-30 12:10:12 0 367
Andhra Pradesh
Alipiri Walkers: తిరుపతిలో వాకర్స్ రాస్తారోకో .. భక్తులకు తీవ్ర ఇబ్బందులు.
Andhra   Alipiri Walkers Protest Disrupts Traffic in Tirupati తిరుపతి అలిపిరిలో వాకర్స్...
By Pagadala Venkateswar 2026-03-02 07:59:55 0 201
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం
పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాన్ సాహెబ్ మిట్ట వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది....
By Kothuru Murali 2026-03-15 10:11:18 0 203
Telangana
భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో...
By Sidhu Maroju 2026-07-18 12:33:24 0 220
Andhra Pradesh
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:26:59 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com