తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.

0
146

 

తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు

03-05-2026 Sun 19:24 | Both States

Tirumala Overcrowded Queues Extend to ATGH

వారాంతం కావడంతో తిరుమల కొండపై రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

శనివారం 91,005 మందికి శ్రీవారి దర్శనం

హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం

వారాంతం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపల ఏటీజీహెచ్ వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం (మే 2) ఒక్కరోజే 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 36,257 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లుగా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

 

భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ అధికారులు క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. దర్శనానికి ఎక్కువ సమయం పడుతున్నందున, భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 77వ గణతంత్రదిన వేడుకలు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ...
By Pagadala Venkateswar 2026-01-26 05:52:58 0 229
Andhra Pradesh
సత్తెనపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
సత్తెనపల్లి 08-01-2026   ప్రచురణార్థం    *సత్తెనపల్లిలో జరిగిన ఆర్యవైశ్య...
By Rajini Kumari 2026-01-08 11:52:32 0 219
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:బూరగమందలో ఘనంగా సీతారాముల కళ్యాణం, భజనలతో అలరించిన భక్తులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ మొరం మీద పల్లెలో శ్రీరామనవమి...
By Kothuru Murali 2026-03-28 06:16:29 0 237
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి....
By Kothuru Murali 2026-01-26 07:07:12 0 266
Uttar Pradesh
UP Expands Digital Governance and Citizen Services
Uttar Pradesh continues to strengthen digital governance by expanding online public services and...
By Fathima Safa 2026-06-27 05:32:29 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com