జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
118

 

జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

04-05-2026 Mon 07:39 | Both States

Chandrababu Naidu Congratulates JEE Mains Toppers

100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు

ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు

నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం

జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించి టాపర్లుగా నిలిచిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు నిన్న రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

వివరాల్లోకి వెళ్తే, నారాయణ విద్యాసంస్థల్లో చదివి 100 పర్సంటైల్ సాధించిన మహిత్ ఆంధ్రప్రదేశ్‌లో టాపర్‌గా నిలిచారు. అలాగే తెలంగాణ నుంచి సాయి రిత్విక్‌రెడ్డి, మహేశ్వరి, భవితేష్‌రెడ్డి టాపర్లుగా నిలిచారు. ఈ విద్యార్థులతో పాటు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు కె. పునీత్, గంటా రవితేజ, పి. సింధూర, శరణి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 

ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తెలుగు విద్యార్థుల ప్రతిభను చాటుతున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.
వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి.  చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ...
By John Baji 2026-02-03 03:29:18 0 203
Telangana
కరీంనగర్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు
కరీంనగర్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు కరీంనగర్: టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఆధ్వర్యంలో...
By Thalakokkula Sadanandam 2026-08-13 17:19:25 0 132
Telangana
పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "
UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు...
By Sunka Santhosh 2026-05-07 04:19:26 0 253
Andhra Pradesh
హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ*
* తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:33:51 0 276
Telangana
నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి...
By Sadaq Sadaq 2026-04-19 12:04:32 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com