కుక్కల రక్తంతో వ్యాపారమంటూ వస్తున్న వార్తలు పూర్తిగా ఆవాస్తవం

0
137

ఓ వార్త సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పెట్స్ కేర్ ఓ వార్తసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఛైర్మన్ వెంకట్ యాదవ్ స్పందించారు. కుక్కల రక్తంతో వ్యాపారమంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తమ ఆస్పత్రి అభివృద్ధిని ఓర్చుకోలేక.. కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం రోజున హైదరాబాద్‌లోని బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన వెంకట్ యాదవ్.. పలు వివరాలను వెల్లడించారు.

‎కుక్కల రక్తం మనుషులకు ఉపయోగపడదన్న వెంకట్ యాదవ్.. దీంతో దందా చేయడానికి ఏమీ ఉండదని అన్నారు. ఇటీవలి కాలంలో కుక్కలకి కేన్సర్, టిక్ ఫీవర్ వంటి రోగాలు వస్తున్నాయని.. అలాంటి అరుదైన సమయాల్లో మాత్రమే కుక్కలకు రక్తం ఎక్కిస్తామన్నారు. తమ ఆస్పత్రి స్థాపించి సుమారుగా 15 సంవత్సరాలు కావొస్తోందన్న పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఛైర్మన్ వెంకట్ యాదవ్.. ఇప్పటివరకు లక్షల కుక్కలకు చికిత్సలు, సర్జరీలు చేశామని వివరించారు.

‎మధ్య కాలంలో తమ ఆస్పత్రి రిఫరల్ హాస్పిటల్‌గా ఎదిగిందన్న వెంకట్ యాదవ్.. తమ మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇలా ఎలా ఎదుగుతున్నాడనే అసూయతో కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకే హాస్పిటల్ నుంచి వచ్చిన కొంతమంది స్టాఫ్‌ని ఆరు నెలల క్రితం తీసుకున్నామని.. వీళ్లలో కొంతమంది పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చి ఇన్‌పేషెంట్‌లో కొన్ని ఫొటోలు, వీడియోలు బయటపెట్టారని వెంకట్ యాదవ్ చెప్పుకొచ్చారు. కొంతమంది డాక్టర్లు, స్టాఫ్ కలిసి ఈ పని చేశారన్న ఆయన.. వాళ్లందరిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలాగే పరువు నష్టం దావా కూడా వేస్తామని వెంకట్ యాదవ్ స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో వీధి కుక్కల రక్తంతో వ్యాపారం అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. వీధి కుక్కల రక్తాన్ని సేకరించి.. అనారోగ్యంతో బాధపడే పెంపుడు కుక్కలకు ఎక్కిస్తూ దందా చేస్తున్నారంటూ జంతుప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వెటర్నరీ అధికారులు చర్యలు తీసుకోవటం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యంగా, బలిష్టంగా ఉన్న కుక్కలను స్టెరిలైజేషన్ పేరుతో పట్టుకొని లీటర్ల కొద్ది రక్తాన్ని తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ.. ఫోటోలతో సహా తెలంగాణ జంతు సంక్షేమ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది.

Search
Categories
Read More
Telangana
పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల నియోజకవర్గం : లక్షెట్టీపేట్ మండల హన్మంతుపల్లి గ్రామానికి చెందిన D. లావణ్య ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-13 14:54:14 0 224
Telangana
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు  ...
By Pinnehasan Odela 2026-03-06 14:06:20 0 267
Telangana
ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం పెళ్లయిన కొద్దిరోజులకే గురుకుల లెక్చరర్ తేజస్విని దుర్మరణం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పెళ్లయిన కొద్దిరోజులకే జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు...
By Chunarkar Jagadeesh 2026-09-13 15:08:50 0 155
Andhra Pradesh
పుంగనూరు:ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు...
By Kothuru Murali 2026-03-14 08:30:58 0 188
SURAKSHA
Dr. Shahid Iqbal Choudhary: A Visionary IAS Leader
A dynamic 2009-batch AGMUT cadre IAS officer whose innovative governance, inclusive development,...
By Lokeshwari Panthadi 2026-07-22 08:33:12 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com