"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|

0
231

మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో సేవలు అందించిన ముగ్గురు పోలీస్ అధికారులు నేడు పదవీ విరమణ పొందారు. 

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. 

పదవీ విరమణ పొందిన వారిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ సబ్ ఇన్స్పెక్టర్ కె. కరుణాకర్ రెడ్డి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హెచ్. బండయ్య మరియు ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్‌లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన బి. కిష్టయ్యలు ఉన్నారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి అడ్మిన్ డీసీపీ శివ కుమార్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇన్నేళ్ల పాటు శాఖకు సేవలు అందించడం గర్వకారణమని కొనియాడారు. 

వారి క్రమశిక్షణను అభినందిస్తూ భవిష్యత్తులో వారు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీఏఓ అడ్మిన్ శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కో ఆపరేటివ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ట్రెజరర్ బాలరాజు, డైరెక్టర్లు సువర్ణ, వల రాజు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Health & Fitness
No Link to Sudden Deaths and COVID Vaccination
There is no direct link between sudden deaths in adults and Covid-19 vaccines, the Ministry of...
By Bharat Aawaz 2025-07-03 08:31:56 0 3K
Andhra Pradesh
మద్యం షాపుల రెన్యూవల్: ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సిందేనన్న హైకోర్టు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుము వివాదంపై...
By Pagadala Venkateswar 2026-09-19 06:46:35 0 44
Andhra Pradesh
వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం.
నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా...
By Pagadala Venkateswar 2026-05-12 06:08:40 0 132
SURAKSHA
WB Retired Police: Service Continues Beyond Uniform
Yesterday retired West Bengal police officers proved that service never stops with uniform. They...
By Kalaga Sailaja 2026-07-03 12:52:52 0 108
Telangana
ఆటో డ్రైవర్ నిజాయితీ- తన ఆటోలో మర్చిపోయిన విలువైన ఆభరణాలను అందజేసి ప్రశంసలు పొందాడు.|
హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్‌ను...
By Sidhu Maroju 2026-02-27 06:23:46 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com