వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు.

0
161

 

 

వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు

27-04-2026 Mon 18:47 | Andhra

CM Chandrababu speech In AU Event

ఏయూ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం

సీఎం చంద్రబాబు ఉత్తేజపూరిత ప్రసంగం

యూనివర్సిటీ అభివృద్ధికి రూ.112 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో పారిశ్రామిక రంగానికి ఏయూ అనుసంధానం కావాలని పిలుపు

గత వైభవాన్ని స్మరిస్తూనే భవిష్యత్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

"వంద సంవత్సరాల వేడుక రోజు చెబుతున్నా, రాబోయే వంద సంవత్సరాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) మరో సరికొత్త చరిత్రను సృష్టిస్తుంది... ప్రపంచంలోనే ఓ ఉత్తమ బ్రాండ్‌గా నిలుస్తుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థుల ఉత్సాహాన్ని చూస్తుంటే వారి ఆనందం ఆకాశాన్ని తాకుతోందని అభినందించారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వందేళ్ల ఏయూ పండుగ ఒక చారిత్రక ఘట్టమైతే, ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడం మరో చరిత్ర అని అన్నారు. గూగుల్ కంటే ముందే ఏయూ తన ఖ్యాతితో ప్రపంచాన్ని విశాఖతో అనుసంధానం చేసిందని, వివిధ దేశాల విద్యార్థులు ఇక్కడ చదవడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశాన్ని ఏయూలోనే నిర్వహించామని, ఇది ఈ వర్సిటీకున్న ప్రత్యేకతను చాటుతోందని గుర్తుచేశారు.

 

ఏయూ చారిత్రక నేపథ్యాన్ని, దానికి సేవ చేసిన మహానుభావులను చంద్రబాబు స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం కంటే ముందే ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి జైపూర్ రాజా విక్రమ దేవ్, గజపతి, పిఠాపురం, బొబ్బిలి రాజవంశీయులు చేసిన కృషిని మర్చిపోలేమని అన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కట్టమంచి రామలింగారెడ్డి తొలి వీసీగా బలమైన పునాది వేస్తే, రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తుచేశారు. వెంకయ్య నాయుడు వంటి ఎందరో రాజకీయ ఉద్దండులను, పారిశ్రామికవేత్తలను అందించిన ఘనత ఏయూదని ప్రశంసించారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా రూ.112 కోట్లతో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా, సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు, స్టార్టప్‌లకు వేదిక కావాలని పిలుపునిచ్చారు. నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.

 

"పని చేసే బాధ్యత మాది, సహకరించే బాధ్యత మాది, కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే" అంటూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. బంగారం లాంటి విద్యార్థులు, మంచి ప్రొఫెసర్లు ఉన్నారని, ప్రపంచంలోని జ్ఞానాన్ని ఇక్కడికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గతం స్ఫూర్తితో భవిష్యత్‌లో ఏయూ మరో అద్భుతమైన చరిత్ర సృష్టిస్తుందన్న పూర్తి విశ్వాసం తనకుందని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

Like
1
Search
Categories
Read More
Telangana
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్...
By Sidhu Maroju 2025-08-17 07:39:47 0 648
Andhra Pradesh
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి వ్యవసాయ శాఖ అచ్చం నాయుడు నాయుడు
*Press Release*     *ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి జ‌గ‌న్ వ్య‌తిరేకి*...
By Rajini Kumari 2026-01-05 12:01:25 0 413
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో రూ1.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంమ్మెల్యే కోవాలక్ష్మి
🎤ఆసిఫాబాద్ భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్కర్ జగదీష్. మే 14):కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-05-14 18:09:14 0 631
Telangana
"కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభం
🎤కుమురం భీం ఆసిఫాబాద్: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్ కార్ జగదీష్  ఎండలు తీవ్రంగా...
By Chunarkar Jagadeesh 2026-05-17 02:32:44 0 578
Telangana
"Helmet On, Worries Gone" సందేశంతో సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ శిల్పావిష్కరణ.|
సికింద్రాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించి, హెల్మెట్...
By Sidhu Maroju 2026-06-01 16:09:47 0 334
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com