గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ.

0
129

15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు

తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలలో 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

పర్యటనలో భాగంగా సింహాచలం దర్శనం, రైల్వే జోన్ అధికారులతో సీఎం భేటీ

రాత్రి గూగుల్ ప్రతినిధులతో సమావేశమై విందు ఇచ్చిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

 

దాదాపు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో, 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. దీని కోసం విశాఖ జిల్లాలోని తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో ప్రభుత్వం సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ రూపురేఖలు మారడంతో పాటు, రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.

 

ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు గూగుల్ కంపెనీ ప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు. నేటి భూమిపూజ కార్యక్రమం తర్లువాడలో జరగనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని, సీఎం చంద్రబాబు డెలిగేట్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

అనంతరం మధ్యాహ్నం సింహాచలం వెళ్లి శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం తన విశాఖ పర్యటన ముగించుకుని అమరావతికి తిరుగు పయనమవుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్ లో సమస్యలు విన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష.
మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్ లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం....
By Pagadala Venkateswar 2026-03-02 07:53:29 0 190
SURAKSHA
North Andhra Upgrades to Advanced Tech-Driven Police Command Control Room
 A state-of-the-art Command Control Room was recently inaugurated in the Visakha Range....
By Kalaga Sailaja 2026-06-30 12:15:05 0 96
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:29:18 0 91
Telangana
బీసీ బందుకు మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికులు — సంఘీభావం తెలిపిన ఈటెల
సికింద్రాబాద్:  బీసీ సంఘాల పిలుపుమేరకు ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బందులో పాల్గొన్న...
By Sidhu Maroju 2025-10-18 13:11:12 0 326
Chandigarh
Political Heat: CM Mann Takes on Centre in Chandigarh
It’s a high-stakes Friday at the Punjab Raj Bhavan area as Chief Minister Bhagwant Mann...
By Dunna Jessicaruth 2026-05-15 09:34:00 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com