ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో

0
193

ఎమ్మిగనూరు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (AP SERP) ఆధ్వర్యంలో గ్రామ సంఘ సహాయకులు (VOA)లకు 5G సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకులను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 28,500 5G స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా గ్రామీణ కమ్యూనికేషన్ బలోపేతం అవడంతో పాటు, స్వయం సహాయక సంఘాల (SHGs) సేవల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందని చెప్పారు.

ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా VOAs తమ SHG సభ్యుల డేటా, రుణాలు, సంక్షేమ పథకాల వివరాలను రియల్ టైమ్‌లో నిర్వహించగలరని, ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ విధానాన్ని తొలగించి పారదర్శకత మరియు వేగాన్ని పెంచుతుందని తెలిపారు. మహిళల ఆధ్వర్యంలోని సంఘ వ్యవస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ స్థాయి సిబ్బందికి మెరుగైన పనివాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మూడు మండలాల APOలు మరియు సిబ్బంది, ఏఎంసీ చైర్మన్, టీడీపీ నాయకులు, గ్రామ సంఘ సహాయకులు (VOAs) మరియు స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 7లోపు దరఖాస్తు చేయండి.
మదనపల్లె అర్బన్ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం...
By Pagadala Venkateswar 2026-05-04 05:48:21 0 145
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గొల్లపూడి లో ఘనంగా టిడిపి 44 వసంతాల ఆవిర్భావ వేడుకలు    ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల...
By Rajini Kumari 2026-03-30 04:49:39 0 217
Telangana
నిజామాబాద్: కాలనీ సమస్యలపై. మున్సిపాల్. కమీష్నార్ కి వినతి పత్రం అందజేసిన సీపీఎం నాయకులు
నిజామాబాద్. రోటరీ నగర్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను బీటీ రోడ్డు సమస్యను...
By Sadaq Sadaq 2026-04-21 14:31:20 0 275
Andhra Pradesh
ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.
అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్...
By Pagadala Venkateswar 2026-06-27 05:41:35 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com