సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్.

0
132

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు

ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించిన పురస్కారం

ముంబైలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం

ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ది ఎకనామిక్ టైమ్స్' ఆయనను 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025' అవార్డుతో సత్కరించింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిన్న జరిగిన 26వ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

 

పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో చేసిన కృషికి గాను చంద్రబాబుకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్' వంటి విధానాలను అమలు చేయడం, స్వల్పకాలంలోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలను ఆకర్షించడంలో చూపిన చొరవను ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.

 

ఈ పురస్కారంపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. "చంద్రబాబు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అమలు చేస్తున్న పాలనా విధానాలు, పారిశ్రామికవృద్ధికి చేపడుతున్న సంస్కరణలు కచ్చితంగా సత్ఫలితాలనిస్తాయి. ఆయనకు దక్కిన ఈ అవార్డు రాష్ట్రమంతటికీ గర్వ కారణంగా భావిస్తున్నాను," అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయ పాలదర పెంపు లీటర్కు రెండు రూపాయలు
*విజయ పాల ధరలు పెంపు...లీటరుకు రూ.2, పెరుగు బకెట్లపై రూ.30 వరకు...స్టాండర్డ్ పెరుగు బకెట్ పై...
By Rajini Kumari 2026-04-02 16:40:00 0 213
Telangana
ఎన్. టీ. ఆర్ పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలి: ఆర్. వి. కె
ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్  వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్...
By Krishna Balina 2026-01-19 04:30:38 0 533
PRAGATI
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By PRAGATI 2025-04-30 11:44:14 0 6K
Telangana
ఘనంగా బీర్ల శంకర్ జన్మదిన వేడుకలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 14  ఈరోజు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు సర్పంచ్ల ఫోరం...
By Pindikura Mahesh 2026-05-14 18:08:04 0 221
Andhra Pradesh
గుంటూరు జిల్లాSP శ్రవణ్ కుమార్ జిందల్IPS గారు అవగాహన కార్యక్రమం
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 23.12.2025*   _*//రోడ్డు ప్రమాదాలు మరియు...
By Rajini Kumari 2025-12-24 08:23:37 0 383
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com