ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి

0
299

ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి..

నందిగామ ఎన్టీఆర్ జిల్లా 

ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో ఇరువురు మృతి చెందిన దుర్ఘటన కంచికచర్ల చెరువు కట్ట దాటిన తర్వాత 65 నెంబర్ జాతీయ రహదారిపై మిశ్రా దాబా వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. కంచికచర్ల మండలం కీసర గ్రామం నుండి ఎస్ కే బాబు అనే వ్యక్తి ఆటో సర్వీస్ చేసుకుంటూ కంచికచర్ల వచ్చాడు. కీసర తిరుగు ప్రయాణంలో ఆటోలో అరటి గెలలు వేసుకొని వెళ్తుండగా కంచికచర్ల గ్రామంలోని ప్రణీత కాలనీకి చెందిన పసుపులేటి కిట్టమ్మ నందిగామ వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా కంచికచర్ల శివారులో మిత్ర ఆక్సిన్ కంపెనీ దాటిన తర్వాత మిశ్రా దాబా వద్ద, నందిగామ వైపు వెళుతున్న ఇన్నోవా కారు ఆటోని వెనుక నుండి డీ కొనడంతో ఆటో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎస్ కె బాబు(45) అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న పసుపులేటి కిట్టమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం మహిళను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అందించి, గాయాల తీవ్రత దృష్ట్యా మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు కంచికచర్ల ఎస్ఐ పి. విశ్వనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్...
By Kothuru Murali 2026-05-21 18:14:34 0 118
Telangana
Ivvaltnunchi bonalu
గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు...
By G k Nookala 2026-07-16 01:29:49 0 138
Andhra Pradesh
అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...
పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు...
By Gadiyapudi Narendra 2026-03-05 18:11:41 0 757
Telangana
ఓటును రక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
హుజూర్‌నగర్  / భారత్ అవాజ్ : దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special...
By Malla Rambabu 2026-07-18 07:53:28 1 528
Andhra Pradesh
ఈ రోజు బాపట్ల టౌన్ ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసీన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ,బాపట్ల నియోజకవర్గం ఇంచార్జి కోన రఘుపతి
బాపట్ల: ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం...
By Gadiyapudi Narendra 2026-03-17 11:38:36 0 621
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com