చీరాలలో ఉచిత మెగా కార్డియాక్ క్యాంప్, గుండె ఆరోగ్యంపై అవగాహన

0
270

చీరాల 

గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు నిర్ధారణ కోసం చీరాలలో మెగా కార్డియాక్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కీ॥శే॥లు శ్రీజిత్ స్వరూప్ జ్ఞాపకార్థం బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడా కె.వై.కె. విజయ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.

ఈ మెగా కార్డియాక్ క్యాంప్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సిపాయిపేటలోని విశాల్ మార్ట్ సమీపంలో నిర్వహించనున్నారు. గుండె జబ్బుల ప్రమాదంలో ఉన్నవారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేకంగా 30 సంవత్సరాల పైబడినవారు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు, ధూమపానం లేదా మద్యపానం చేసే వారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, అలాగే ఛాతినొప్పి, అయాసం, గుండె దడ వంటి లక్షణాలు ఉన్నవారు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ శిబిరంలో భాగంగా సీబీసీ , ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (ఎఫ్ బి ఎస్ ), లిపిడ్ ప్రొఫైల్, కార్డియాక్ ఎంజైమ్ (సికె-ఎంబి ), ఈసీజీ (ఈసీజి ) వంటి పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. సుమారు రూ.2000 విలువ గల ఈ పరీక్షలను బి.ఎన్.ఎస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఉచితంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

“ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుంది” అనే నినాదంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శిబిరంలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా 78423 76111, 78423 67111 నంబర్లకు సంప్రదించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Voter Verification Drive in Bihar May Disenfranchise Millions
Bihar, July 2025: A new voter verification process in Bihar has sparked widespread concern. Ahead...
By Citizen Rights Council 2025-07-29 04:54:33 0 2K
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 03:34:57 0 189
Andhra Pradesh
బాధిత ముస్లిం యువకునికి అండగా... సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ
బాధిత ముస్లిం యువకునికి అండగా... సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ  మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం...
By Chennaiah Kati 2026-06-30 14:00:54 0 118
SURAKSHA
Shri Dinesh Kumar Muhal: A Rising Star in Public Service
A young 2023-batch AGMUT cadre IAS officer, Shri Dinesh Kumar Muhal is serving as Resident Deputy...
By Lokeshwari Panthadi 2026-07-27 07:36:07 0 199
Delhi - NCR
Delhi-NCR Strengthens Sports Development Across Region
Delhi-NCR continues to promote sports development by expanding world-class infrastructure,...
By Fathima Safa 2026-07-02 06:31:45 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com