"బాలుడు ఆసిఖ్ మిస్సింగ్ : వివరాలు వెల్లడించిన ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్!

0
308

సికింద్రాబాద్ : వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ వెల్లడించారు. 

వెస్ట్ మారేడుపల్లిలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సమీపంలో నివసించే మొహమ్మద్ అలీ ఖాన్ మనవడు ఆసిఖ్ (16) ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన లగేజీతో సహా బయటకు వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రులు మరణించడంతో ఆసిక్ తన తాత మొహమ్మద్ అలీ ఖాన్ సంరక్షణలో ఉంటున్నాడు. 

22వ తేదీ తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి తాత ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 106/2026 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ తెలిపారు. 

ప్రస్తుతం ఏఎస్ఐ లింగయ్య ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అదృశ్యమైన బాలుడు 5.5 అడుగుల ఎత్తు ఉండి, నలుపు రంగు టీ-షర్ట్ మరియు ట్రౌజర్ ధరించి ఉన్నాడు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగల ఈ బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా 9885700365 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్.హెచ్.ఓ. విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
జోనల్ కమిషనర్ తో సమావేశం- అల్వాల్ పురోగతి దిశగా మరో అడుగు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  అల్వాల్ డివిజన్ లో దోమల బెడద పెరిగి ప్రజారోగ్యంపై...
By Sidhu Maroju 2026-01-16 16:27:01 0 248
Bihar
Bihar Wooing Investors With Amended Package
Addressing the centenary business conclave of the Bihar Chamber of Commerce and Industries in...
By Dunna Jessicaruth 2026-05-25 05:00:04 0 112
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నె తండాకు చెందిన మల్లేష్ నాయక్ (33)...
By Pagadala Venkateswar 2026-03-16 07:09:24 0 202
Andhra Pradesh
పుంగనూరు జామియా మస్జీద్ కమిటీ నియామకం: వక్ఫ్ బోర్డు ఛైర్మన్ చేతుల మీదుగా
6 ఫిబ్రవరి 2026న, పుంగనూరులోని జామియా మస్జీద్ (రాతి మస్జీద్) కమిటీకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు...
By Kothuru Murali 2026-02-07 06:47:08 0 173
Telangana
"మంగాపురం పార్క్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపురం కాలనీ పార్క్‌లో...
By Sidhu Maroju 2026-05-26 05:53:05 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com