కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్

0
138

హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. 

‎పులి తిన్న ఆవుల గురించి బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. 

‎పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తేనే జీవన్ రెడ్డికి ఆయన కథేమిటనేది అర్థమవుతుందన్నారు. 

‎జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినప్పుడు కనిపించ లేదా? అని ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. 

‎‎సీఎం రేవంత్ రెడ్డి సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని ఆరోపించారు. 

‎రేవంత్ సభ 20 రోజుల ముందే ఫిక్స్ అయిందని గుర్తు చేశారు.

‎కేసీఆర్‌కి మాది కౌంటర్ ప్రోగ్రాం కాదని కుండబద్దలు కొట్టారు. 

‎ఆశల పల్లకిలో ఊరేగించడం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి అలవాటేనంటూ వ్యంగ్యంగా అన్నారు. 

‎జీవన్ రెడ్డికి కేసీఆర్ ఏం ఆశలు చూపించారో అంటూ ఎద్దేవా చేశారు.

‎మేడిగడ్డలో కేసీఆర్ చేసిన మోసాలపై జీవన్ రెడ్డే తమకు పాఠాలు చెప్పారని ఈ సందర్భంగా టీ పీసీసీ చీఫ్ గుర్తు చేసుకున్నారు. 

‎అలాంటి జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కోరస్ ఇస్తున్నాడని విమర్శించారు. 

‎గతంలో కేకే, డీఎస్ లాగే జీవన్ రెడ్డి కూడా బాధపడుతారని చెప్పారు. 

‎రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని స్పష్టం చేశారు. 

‎రేవంత్ పోవాలి మార్పు రావాలి అనే హక్కు ఎక్కడిది? 

‎జీవన్ రెడ్డికి అంటూ ఆయనపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు.

Search
Categories
Read More
SURAKSHA
Biju George Joseph: Strengthening Law and Order
A distinguished 1995-batch Rajasthan Cadre IPS officer, Biju George Joseph has earned widespread...
By Lokeshwari Panthadi 2026-07-23 10:40:21 0 258
SURAKSHA
Upendra Kumar Jain: Championing Justice Against Economic Crime
A distinguished IPS officer of the Madhya Pradesh cadre, Shri Upendra Kumar Jain serves as the...
By Lokeshwari Panthadi 2026-07-23 05:53:58 0 233
Andhra Pradesh
చౌడేపల్లి: పెన్షన్ల పంపిణీ పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
చౌడేపల్లి మండలం, చౌడేపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని...
By Kothuru Murali 2026-06-01 10:39:36 0 149
Telangana
వెంకటాపురం కాలనీలో చెత్త అసాంఘిక కార్యకలాపాలతో నివాసితుల ఇబ్బందులు
మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.    జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్...
By Sidhu Maroju 2025-08-04 12:42:56 0 851
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com