గంటల వ్యవధి లో కనబడని పిల్లవాడిని కనుగొన్న ఎస్ ఐ శివకుమార్ యాదవ్* *పిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఎస్ ఐ*

0
283

నిన్న అనగా సోమవారం పిట్టలవానిపాలెం మండల పరిధి లోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన నాగ సాయి అనే బాలుడు కనబడటం లేదు అని తల్లిదండ్రులు చందోలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. పిర్యాదు స్వీకరించిన వెంటనే ఎస్పీ గారి ఉత్తర్వులు మేరకు, డీఎస్పీ, సీఐ అదేశాల మేరకు ఆచూకీ కోసం ఎస్ ఐ శివకుమార్ వారి సిబ్బంది తో తీవ్రంగా రేయంబవళ్లు శ్రమించారు. కష్టానికి తగిన ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానం తో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. దీనికి ప్రధాన కారణం ఎస్ ఐ వివరణ ప్రకారం బాలుడు తన తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వమని అడగగా నిరాకరించారు. దీనితో మనస్తాపం చెంది నాగ సాయి కొంత సొమ్ము తో టికెట్ కొని మద్రాస్ రైల్ ఎక్కి పారిపోయాడు.సాంకేతిక పరిజ్ఞానం తో కనుగొనగా చెన్నై వెళ్లినట్లు గుర్తించారు. ఇంత తక్కువ సమయం లో కష్టపడి తన అనుభవం తో కేస్ ను ఛేదించినఎస్ ఐ శివకుమార్ ను బాలుడి తల్లిదండ్రులు అభినందనలు తెలుపుతున్నారు.అసలు చందోలు పోలీస్ స్టేషన్ లో ఇప్పటి ఎస్ ఐ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఎన్నో కేస్ లు ఛేదించి అందరి చేత మన్ననలు పొందారు. అంతే కాకుండా తమ శాఖ గురించి ప్రజలకు అవగాహన కలిపించటం కోసం నిత్యం కఠోర శ్రమతో ఉద్యోగ బాధ్యతలు చేస్తూ నేరగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అని ప్రజల్లో జోరుగా అభినందనల వెల్లువెత్తుతున్నాయి.ప్రతి ఒక్కరికి ఎస్ ఐ అంటే కుటుంబసభ్యుడిలా ఉంటూ తనదైన శైలి లో ముందుకు సాగుతూ తన సిబ్బందిని కూడా నిబద్దత తో ఉద్యోగం చేయించడం ఆయన పని తీరుకు దర్పణం పడుతుంది. రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అలంకరించాలి అని ప్రతి ఒక్కరి కోరిక.దీనికి ప్రధాన కారణం ఈ స్థాయిలో ఇంత నిబద్దత తో ఉద్యోగం చేస్తూ ఉంటే ఉన్నత స్థాయి లభిస్తే ఇంకా ఎన్నో పనులు చేసి అందరి మన్ననలు పొందుతారని అందరి భావన..

Search
Categories
Read More
Andhra Pradesh
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో...
By Chennaiah Kati 2026-01-30 13:30:05 0 248
Telangana
Police stop Armur mla Rakesh Reddy sent to Kamareddy mla office
ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు...
By G k Nookala 2026-06-29 06:32:36 0 267
Bharat Aawaz
India's Gold Loan Crisis: Survival Debt Traps Middle Class
In India, gold is not a mere ornament; it represents generational savings, deep emotion, and...
By Hazu MD. 2026-06-06 09:51:05 0 405
Telangana
టీ ఎస్ పాలీసెట్ రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించిన కొడారు కౌశిక్ సాయి
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం కుమారుడు కొడారు కౌశిక్ సాయి ఈ రోజు విడుదలైన...
By Nookapangu Manikanta 2026-05-23 08:43:09 0 315
Andhra Pradesh
పుంగనూరు: తమ్మి నాయన పల్లి లో పౌర హక్కుల దినోత్సవం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తమ్మి నాయన పల్లి ఎస్సీ కాలనీలో శనివారం...
By Kothuru Murali 2026-02-01 05:33:35 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com