Bharat Aawaz

అధికారులు డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి

Patan Khuddus
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
577
Views

డ్రైనేజీ  సమస్యను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించండి..!

రాకపోకలకు తీవ్ర అంతరాయం లేకుండా చేయండి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయి. కాలువలు సరిగా లేకపోవడం, మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో వీధులు చెత్తనీటితో నిండిపోయాయి. దీంతో పాదచారులు, వాహనదారులు రోజువారీ ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రత్యేకంగా నిల్వ నీటి కారణంగా దుర్వాసన వ్యాపిస్తూ, దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి, రోడ్లను శుభ్రపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.