సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా – ఈ నెల 20న 650కి పైగా ఉద్యోగాలు

0
260

చీరాల, మార్చి 17: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ చర్చ్ కాంపౌండ్‌లో ఏప్రిల్ 20, 2026 (సోమవారం) ఉదయం 9 గంటల నుండి ఈ జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ గారపాటి పుష్ప రాజు వెల్లడించారు.

ఈ జాబ్ మేళాకు భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కెఎస్ఆర్ హ్యాండ్లూమ్స్, ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్స్, ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మాస్టర్ మైండ్స్, క్యాపస్టన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్టెల్, గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ వంటి ప్రముఖ సంస్థలు హాజరుకానున్నాయి.

మొత్తంగా 650కి పైగా ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థుల విద్యార్హతలను బట్టి నెల జీతం సుమారు రూ.10,000 నుండి రూ.20,000 వరకు ఉండనున్నట్లు పేర్కొన్నారు.

ఈ జాబ్ మేళాకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఎడ్, బి.టెక్, ఎంబీఏ, పీజీ వంటి వివిధ అర్హతలు కలిగిన 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకావచ్చు.

అభ్యర్థులు తమ బయోడేటా/రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు నకలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

అలాగే ముందస్తుగా నమోదు చేసుకోవడానికి https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.

మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు:

📞 7981443777, 8555901198, 9100566581, 9949914337

టోల్ ఫ్రీ నంబర్: 9988853335

చీరాల పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Search
Categories
Read More
SURAKSHA
A. Akbar IPS: Leading Kerala Police with Courage & Vision
The Journey Begins "The true strength of a police officer lies not only in...
By Fathima Safa 2026-07-08 12:27:59 0 440
Andhra Pradesh
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
By Mobbu Venkatramana 2026-03-19 12:06:29 0 539
Andhra Pradesh
పుంగనూరు: ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి
విజయ కుమారి, శివ రత్నమ్మ గురువారం కలమందలవారిపల్లి ఎంపీపీ పాఠశాలలో వార్షికోత్సవానికి హాజరయ్యారు....
By Kothuru Murali 2026-04-22 14:38:03 0 147
Andhra Pradesh
పుంగనూరు: అంబటి ఇంటి మీద దాడి పై స్పందించిన పెద్దిరెడ్డి
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By Kothuru Murali 2026-02-01 09:46:56 0 215
Telangana
బొల్లారం ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ.|
● అత్యంత భద్రత మధ్య 12 ఆయుధాలు మాయం ● ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు ●...
By Sidhu Maroju 2026-09-01 15:31:20 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com