మహనీయుల స్ఫూర్తితో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన రక్తదాన శిభిరం విజయవంతం-CITU

0
354

ఈరోజు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ జయంతుల సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తుమ్మల.రాజారెడ్డి మాట్లాడుతూ కేవలం కార్మికుల సమస్యలపైన పోరాటాలు, ఆందోళనలు కాకుండా సామాజిక బాధ్యతగా మహనీయుల స్పూర్తితో నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున దాదాపు 150 కి పైగా యువ కార్మికులు హాజరై రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతినెల రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందని వారికి చేయూతనిచ్చే విధంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు తమ వంతు బాధ్యతగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గత నెలలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మందమర్రిలో మరియు జ్యోతి బాపూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఈరోజు శ్రీరాంపూర్లోని నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమానికి అవగాహన కలిగిన యువకుల నుండి భారీ స్పందన వస్తున్నందున త్వరలో మిగిలిన ఏరియాలలోను ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని అంతేకాకుండా కోల్ బెల్ట్ ప్రాంతాలలో త్వరలో మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నామని తెలిపారు. సింగరేణి యాజమాన్యం కూడా కార్మికులకు నిర్వహిస్తున్న పీ.ఎం.ఈ టెస్టులలో విటమిన్ లోపం, కిడ్నీ, లివర్ లోపాల తదితర టెస్టులను కూడా చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. రక్తదాన శిబిరాలకు హాజరై తమ వంతు బాధ్యతగా ఇతరుల ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేసిన యువకులు అందరికీ యూనియన్ తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులతోపాటు పిట్ సెక్రటరీలందరూ పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Expands Electric Buses and Modern Transport
Tamil Nadu is accelerating the modernization of its public transport system by expanding electric...
By Fathima Safa 2026-06-29 10:09:44 0 117
Andhra Pradesh
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు కూటమి...
By Chennaiah Kati 2026-07-22 15:38:59 0 226
Telangana
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
వెంకటాపురం గ్రామపంచా యతీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని...
By Gujile Ramu 2026-04-22 16:16:07 0 419
Telangana
సూర్యనగర్‌లో హత్య.|
● ఆరు నెలల గర్భిణి దారుణ హత్య ● భర్తే గొంతు నులిమినట్లు అనుమానం ● ఘటనపై అల్వాల్ పోలీసుల...
By Sidhu Maroju 2026-09-14 16:58:21 0 113
Rangareddy
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
‎హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం...
By Ponnala Srinivasrao 2026-08-13 01:07:43 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com