ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

0
207

ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డి సోమన్న, యస్.షాబీర్ భాష మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అడ్మిషన్ల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు కొన్ని విద్యా సంస్థలు అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకున్నా ముందస్తు అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారు మరోవైపు నగరంలో పెద్ద పెద్ద ప్రచార బోర్డులు పెట్టి, ప్రధాన కూడలిలలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో ప్రచారాలు నిర్వహిస్తూ వీఆర్వోలను విద్యార్థుల ఇండ్లకు పంపించి అడ్మిషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రభుత్వా నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రచారాలు నిర్వహిస్తూ అడ్మిషన్లు చేస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు నిదర్శనం అన్నారు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్లకిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్నారు , ఇప్పటికైనా ప్రభుత్వ నియామ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ గుర్తింపు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి సి. అశోక్, నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Vaibhav Galriya IAS: Transforming Rajasthan Finance
A 1998-batch Rajasthan cadre IAS officer, Vaibhav Galriya has earned a reputation as one of the...
By Lokeshwari Panthadi 2026-08-01 05:45:20 0 118
Goa
Goa Water Metro: Eco-Friendly Commuting Revolution
Goa is set to revolutionize its transport landscape as the central government fast-tracks the...
By Lokeshwari Panthadi 2026-06-29 09:47:14 0 94
Andhra Pradesh
చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.
చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్...
By Shyamala Yadagiri 2026-06-05 17:20:02 0 259
Telangana
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
*వరంగల్ జిల్లా :*   చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. ...
By Ellandula Sandeep 2026-01-12 17:44:18 0 634
Andhra Pradesh
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ తన పాత్ర పోషిస్తుంది: డిప్యూటీ సీఎం పవన్.
బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఏపీ డిప్యూటీ...
By Pagadala Venkateswar 2026-08-15 09:50:21 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com