డాక్టర్ లేక పేషంట్ అవస్థలు

0
1K

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు

మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలంలో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సకాలంలో వైద్యం అందకపోవడంతో బాధితుడి పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. కొత్తగూడ మండలంలోని ​చక్రాల తండ గ్రామానికి చెందిన మాలోతు శ్రీను (30) అనే యువకుడు ఎంచగూడెంలో తన పని ముగించుకుని, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో కంకర్ రోడ్డుపై బైక్ అదుపుతప్పి శ్రీను కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి.​రోడ్డుపై గాయాలతో పడి ఉన్న శ్రీనును గమనించిన ఓ... బాటసారి వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 పైలట్ గోవర్ధన్, ఈఎంటీ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి స్థానిక కొత్తగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నైట్ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అత్యవసర సమయంలో వైద్యులు లేకపోవడంతో బాధితుడి పరిస్థితి మరింత విషమించింది. చేసేదేమీ లేక 108 సిబ్బంది ఉన్నతాధికారుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బాధితుడిని నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఇలాంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలు పోకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల ప్రధాన మసీదు సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ – తక్షణ చర్యలు అవసరం
చీరాల: చీరాల పట్టణంలోని ప్రధాన మసీదు సెంటర్ వద్ద ఉన్న మురుగునీటి డ్రైనేజీ ప్రధాన మార్గం ప్రస్తుతం...
By Gadiyapudi Narendra 2026-02-18 16:22:16 0 223
SURAKSHA
Vinay Kumar, IPS: Leading Bihar Police with Vision & Valor
The Journey Begins "Leadership in policing is not measured by authority...
By Fathima Safa 2026-08-01 11:40:30 0 280
Andhra Pradesh
జాతీయ రోలర్ స్కేటింగ్లో విశాఖ అమ్మాయి బంగారు పతకం
విజయవాడ  (17-12-2025)   *స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు* ...
By Rajini Kumari 2025-12-17 09:46:01 0 291
Andhra Pradesh
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసాగిల్
AP హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్   AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్ను...
By Rajini Kumari 2026-02-27 11:17:17 0 168
Telangana
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హైకోర్టులో పిటిషన్.|
● వార్డుల పునర్విభజన చట్టవిరుద్ధమని ఆరోపణ. ● విచారణ ఆగస్టు 11కు వాయిదా. హైదరాబాద్, జులై 20 :...
By Sidhu Maroju 2026-07-20 17:34:15 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com