ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

0
362

*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి* 

 

*జేసీకి బీజేపీ నాయకుల వినతి* 

 

వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 10: నిజాంపేట పరిధిలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమాలను అరికట్టి ప్రజా అవసరాలకు వినియోగించాలని బీజేపీ నాయకులు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సంయుక్త కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

బాచుపల్లి మండలం, నిజాంపేట సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్లు 233/22 నుంచి 233/27 వరకు ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని, ఆ ప్రాంతంలో మినీ స్టేడియం, 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో జేసీ విజయేందర్ రెడ్డిని కలిసి కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సర్వే నంబర్ 233 పరిధిలో ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణలకు గురైందని ఆరోపించారు. 233/22 నుంచి 233/27 వరకు సుమారు 14 ఎకరాలకు పైగా ఉన్న భూమి కూడా కబ్జాలకు గురవుతోందని తెలిపారు. కొందరు స్థానిక నాయకుల అండదండలతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో కమర్షియల్ షాపులు నిర్మించి అద్దెల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, గతంలో డ్రైవ్-ఇన్ హోటల్ పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టగా మున్సిపల్ అధికారులు కూల్చివేసినా, మళ్లీ అదే నిర్మాణం పునరుద్ధరించారని పేర్కొన్నారు. సర్వే నంబర్లు 82, 83, 84, 85లో అంబేద్కర్ భవన్, డిజిటల్ లైబ్రరీ, శ్రీకృష్ణ భవన్, పార్కులు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. సర్వే నంబర్ 340, 341, 342, 346, 347, 348, 332, 334, 95, 96, 97, 103, 105, 109 సర్వే నంబర్లలో జరుగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇందుకు స్పందించిన జేసీ విజయేందర్ రెడ్డి ప్రభుత్వ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బిక్షపతి యాదవ్, శ్రీనివాస్ గుప్తా, ఎన్.ఆర్.కే ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.
మదనపల్లెలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న కరుణాకర్ (36) అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-03-07 04:58:39 0 197
Telangana
పెద్దపల్లి : సాయంత్రం ఈదురుగాలితో వర్షం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో జన జీవనం...
By Sunka Santhosh 2026-05-26 17:42:56 0 144
Andhra Pradesh
కల్తీ నెయ్యి కేసు....ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు
AP: తిరుమలకు 2019-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినా టీటీడీ అడ్డుకోలేకపోయిందని నెల్లూరు కోర్టులో...
By Pagadala Venkateswar 2026-01-23 11:34:06 0 215
Telangana
గురవయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
 స్వేరోస్ సంస్థ క్రియాశీలక కార్యకర్త, ఆటో డ్రైవర్ కందుకూరి గురవయ్య స్వేరో ఇటీవల అనారోగ్యంతో...
By Nookapangu Manikanta 2026-05-08 09:30:49 0 252
Andhra Pradesh
ప్రేమ వ్యవహారంలో పగ పెంచుకుని యువకుడి హత్య.. చీరాలలో దారుణ ఘటన ఐదుగురు నిందితుల అరెస్ట్
చీరాల:  చీరాల పట్టణంలోని రైల్వే ట్రాక్ పక్కన, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన దారుణ...
By Gadiyapudi Narendra 2026-02-04 16:28:10 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com