నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు

0
227

ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి `నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెసలదిన్నె చెరువును పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు.

ఈ కార్యక్రమం నాలుగు దశల్లో అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. మొదటి దశలో 10 రోజుల్లో పనుల గుర్తింపు, రెండో దశలో నిధుల మంజూరు, మూడో దశలో 70 రోజుల్లో పనుల అమలు, అనంతరం 5 రోజుల్లో రిపోర్టింగ్ మరియు డాక్యుమెంటేషన్ నిర్వహించబడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు సాధ్యమవడంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి వ్యవసాయానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షులు, నీటి సంఘాల ప్రతినిధులు, ఎల్‌ఎల్‌సీ డీఈ మరియు ఏఈ, సంబంధిత శాఖ అధికారులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హైటెక్ సిటీలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.|
"శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం." హైదరాబాద్ : హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో నేడు...
By Sidhu Maroju 2026-06-30 09:22:05 0 125
Telangana
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ & జిల్లా కలెక్టర్
నందిపేట్ ఉమ్మెడ్ బ్రిడ్జి, #ఆర్మర్ గుండ్ల చెరువు, #బసారా బ్రిడ్జి, #నిజామాబాద్ నగరంలోని నిమజ్జనం...
By Sadaq Sadaq 2026-09-20 17:11:42 0 41
Andhra Pradesh
YS షర్మిల రెడ్డిAPCC చీఫ్ మాజీ ముఖ్యమంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు
విజయవాడ   *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్...
By Rajini Kumari 2025-12-21 08:57:30 0 243
Andhra Pradesh
పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు ఫక్రూదిన్ షరీఫ్‌ను రాజంపేట జోన్ మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమించారు.
వైయస్సార్సీపి అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణానికి చెందిన మైనారిటీ...
By Kothuru Murali 2026-01-08 13:03:48 0 207
Andhra Pradesh
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది....
By Kothuru Murali 2026-04-05 07:46:31 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com