ఎమ్మిగనూరులో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో బివిజేనేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు

0
278

ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర @2047 – బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ మరిన్ని ప్రాజెక్టులను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. స్వర్ణ ఆంధ్ర లక్ష్య సాధనలో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి (PD), మూడు మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, టీడీపీ మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
D C C సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా మాజీ సర్పంచ్ కొడారు లక్ష్మీనారాయణ నియామకం
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీ నియామకములో చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ ...
By Nookapangu Manikanta 2026-05-05 11:08:31 0 147
Telangana
ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో...
By Sidhu Maroju 2026-01-19 07:10:49 0 288
Andhra Pradesh
స్వాతంత్ర్య సమరయోధుల కుమారులకు గణతంత్ర దినోత్సవం నాడు ఘన సన్మానం.
రామసముద్రం మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గంజి శ్రీనివాసరావు దేశానికి చేసిన సేవలకు...
By Pagadala Venkateswar 2026-01-27 07:15:14 0 204
Andhra Pradesh
హోంగార్డుల గొడవలో కారు దగ్ధం: పోలీసుల విచారణ
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ చిప్పిలేవారిపల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-05-01 12:23:09 0 186
Andhra Pradesh
బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు: ఆసుపత్రికి తరలింపు
చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి పుంగనూరు - చౌడేపల్లె...
By Kothuru Murali 2026-02-26 12:42:46 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com